Tuesday, November 26, 2024

Omicron cases : ఒమిక్రాన్ డేంజర్‌ బెల్స్.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్.. ఇప్పుడు చేప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వేరియంట్ 90 దేశాలను చుట్టుముట్టేసింది. అమెరికా, బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అధికమవుతున్నాయి. ఈ వేరియంట్ యూకేను అతలాకుతలం చేస్తోంది. ఒమిక్రాన్ దెబ్బకు పలు దేశాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతున్నాయి.

అమెరికాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుడి ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒమిక్రాన్ శరవేగంతో ప్రపంచాన్ని చుట్టుముడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు చేయడమంటే ముప్పును కొనితెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం మానొద్దని సూచించారు.

మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62 వేలు దాటాయి. యూకేలో ఒక్కరోజే 10 వేల ఒమిక్రాన్‌ కేసులు నమోదవడం గమనార్హం. ఇప్పటికే పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. హైరిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -


Advertisement

తాజా వార్తలు

Advertisement