దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కు చేరింది. ఒమిక్రాన్ నుంచి ఇప్పటివరకు 151 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఢిల్లీలో 142, మహారాష్ట్రాలో 141 ఓమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీటి తరువాతి స్థానాల్లో కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
తెలంగాణ ఓమిక్రాన్ కేసుల్లో దేశంలో ఆరోస్థానంలో ఉంది. తెలంగాణ ఒమిక్రాన్ 41 మంది సోకగా.. 10 మంది చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు. గుజరాత్ లో 49, రాజస్థాన్ లో 43, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 ఒమిక్రాన్ కేసులు నమోదైయ్యాయి. మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఆదివారం తొలిసారిగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుదలతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూలు విధించాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూలను అమలు చేశాయి. సోమవారం నుంచి ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..