Wednesday, November 20, 2024

Omicron: దేశంలో 1525కి చేరిన ఓమిక్రాన్ కేసులు.. ఏడో స్థానంలో తెలంగాణ

దేశంలో ఓవైపు కరోనా, మరోవైపు ఓ‌మిక్రాన్ కేసులు విజృంభిస్తున్నాయి. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 1,525కు చేరింది. మొత్తం ఒమిక్రాన్ బాధితుల్లో 560 మంది కోలుకున్నారు. మహారాష్ట్రాల్లో అత్యధికంగా 460 కేసులు నమోదు కాగా 180 మంది బాధితులు కోలుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 351 కేసులు నమోదు అయ్యాయి. 57 మంది బాధితులు ఆరోగ్యవంతులైయ్యారు. గుజరాత్ లో 136 నమోదు కాగా.. రాష్ట్రంలో 69 మంది బాధితులు కోలుకున్నారు.

ఇక,తమిళనాడులో 117, కేరళలో 109,రాజస్థాన్ లో 69, తెలంగాణలో 67, కర్ణాటకలో 64, హర్యానాలో 63, పశ్చిమ బెంగాల్ లో 20, ఆంధ్రప్రదేశ్ లో 17, మధ్యప్రదేశ్ లో 9, ఉత్తరాఖండ్ , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 8 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. ఇక, ఛత్తీస్ గఢ్, జమ్ముకాశ్మీర్ లో మూడు చొప్పున, అండమాన్ దీవుల్లో 2 రెండు కేసులు వెలుగు చూశాయి. ఇక, గోవా, హిమాచల్ ప్రదేశ్, లడాఖ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి. ఓమిక్రాన్ కేసులు పెరగడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు కఠినం చేశాయి. ఇప్పటికే నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement