దెయ్యాలున్నాయా.. మీరెప్పుడైనా చూశారా.. అంటే కొంతమంది అవును అని, ఇంకొందరు లేదు అంటుంటారు. అయితే ఎవరి నమ్మకాలు వాళ్లవి. కానీ, మనం సినిమాల్లో చూసినట్టు దెయ్యాలు తెల్లటి బట్టలు ధరించి.. జనాలను భయపెడుతుంటాయి. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం ఓ వింత దృశ్యం జనానులకు ఆసక్తి కలిగించింది. అదేంటంటే.. దెయ్యం రూపంలో ఉన్న చెట్లు ఆ ఏరియాకు సందర్శకుల రాకను పెంచాయి. ఈ వింత చెట్లను చూడ్డానికి చాలామంది టూరిస్టులు క్యూ కట్టారు. దీంతో పాకిస్తాన్‌లోని సింధ్ గ్రామం పర్యాటక ప్రదేశంగా మారింది.
2010లో వచ్చిన భారీ వరదలతో లక్షలాది సాలె పురుగులు చెట్లపైకి చేరాయి. కాలక్రమేణా అవి గూళ్లను అల్లడంతో ఆ చెట్లు ఇప్పుడు అచ్చం సినిమాల్లో చూపించే దెయ్యంలా కనిపిస్తున్నాయి. దీంతో వాటిని చూడ్డానికి పర్యాటకులు వస్తున్నారని సింధు గ్రామస్తులు హ్యాపీగా చెబుతున్నారు. వాటితో తమకెప్పుడు ఇబ్బంది కలగలేదంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital