Friday, November 22, 2024

భారత్ జోడో యాత్రలో ఒమర్ అబ్దుల్లా.. దేశ ప్రతిష్ఠకోసమే యాత్రలో పాల్గొన్నా

ఈనెల 30న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర శుక్రవారం కాశ్మీర్ లోకి ప్రవేశించగా.. రామ్ బన్ జిల్లాలోని బనీహల్ లో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి దాదాపు 2 కిలోమీటర్లు నడిచారు. వీరితోపాటు రెండు పార్టీల నేతలు, వందలాది కార్యకర్తలు యాత్రలో పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ నుంచి ట్రక్ యార్డుకు చేరుకున్న తర్వాత.. పలు అంశాలపై రాహుల్, అబ్దుల్లా చర్చించారు. తర్వాత ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కాశ్మీర్ పండిట్ ఫ్యామిలీకి చెందిన రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని, అందుకే తాము ఆహ్వానించామని చెప్పారు.

బీజేపీ వాళ్లు పిరికిపందలని మండిపడ్డారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని, మిలిటెన్సీ తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇలా జరగలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ వైఖరి గురించి తాను తెలుసుకోవాలని భావించడం లేదని చెప్పారు.భారత్ జోడో యాత్ర రాహుల్ ఇమేజ్ పెంచేందుకు ఉద్దేశించినది కాదు.. దేశంలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు చేపట్టినది. దేశం గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నా. అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నా. వ్యక్తిగత కీర్తి కోసం కాదు.. దేశ ప్రతిష్ఠ కోసమే యాత్రలో పాల్గొంటున్నాం అని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement