హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (శంషాబాద్) ఎయిర్ పోర్టులో ఇవ్వాల రాత్రి పెద్ద మొత్తంలో హెరాయిన్ పట్టుబడింది. ఓ మహిళ నుంచి 5.9 కిలోల హెరాయిన్‌ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హెరాయిన్ విలువ దాదాపు రూ.41.3 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, ఆ మహిళ మలావీ దేశం నుంచి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. హెరాయిన్ ను సూట్ కేసులో దాచి తరలించేందుకు మహిళ ప్రయత్సించింది. కాగా, డీఆర్ఐ అధికారుల తనిఖీలో ఇది బయటపడింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో గతంలోనూ మాదకద్రవ్యాలు, బంగారం పెద్ద మొత్తంలో పట్టుబడడం తెలిసిందే.
TS | ఎయిర్‌పోర్టులో హెరాయిన్ పట్టివేత.. 41.3 కోట్ల విలువ ఉంటుందన్న అధికారులు
Advertisement
తాజా వార్తలు
Advertisement