నిబంధనల పేరుతో ట్రాఫిక్ పోలీసులు సామాన్యులకు విచ్చలవిడిగా జరిమానాలు విధిస్తున్నారు. ఒకవేళ ప్రశ్నిస్తే మీ రక్షణ కోసమే అంటూ సమాధానాలిస్తున్నారు. అయితే ఒక్కోసారి కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతుండటంతో వాహనదారులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. రోడ్డుప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక ట్రక్కు డ్రైవర్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది. ట్రక్కు డ్రైవర్ హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ అధికారులు అతడికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు అధికారులు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. ఇలా ట్రక్కు డ్రైవర్‌కు హెల్మెట్ లేదని వెయ్యి రూపాయల జరిమానా విధించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ట్రాఫిక్ పోలీసులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement