Thursday, November 21, 2024

నెలకు రూ.5 లక్షల సంపాదిస్తున్న గిరిజన కూలీ

యూట్యూబ్‌ను ఓ గిరిజన యువకుడు ఊపేస్తున్నారు. చదవు లేకపోయిన తన వీడియోలతో లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఒక పూట తిండికి నోచుకుని ఆ గిరిజన యువకుడు ప్రస్తుతం యూట్యూబ్‌లో అదరగొడుతున్నాడు. ఒడిశాలోని సంబల్ పూర్ జిల్లాకు చెందిన ఇసాక్ ముండా అనే యువకుడు గతంలో రోజువారీ కూలీగా పనిచేసేవాడు. కరోనా మహ్మరి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌ వలన అతడు తన ఉపాధిని కోల్పోయాడు. దీంతో తన కుటంబం రోడ్డున పడింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో తన స్నేహితుడు సెల్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు చూడ‌టం అతని జీవితాన్నే మార్చివేసింది.

ఇసాక్ ముండా తన స్నేహితుడి ఫోన్‌లో యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగర్‌ కు సంబంధించిన వీడియోలు చూసేవాడు. ఈ క్రమంలో ఫుడ్ బ్లాగర్లను ప్రేరణగా తీసుకుని యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్న ఇసాక్.. రూ.3వేలు అప్పుచేసి ఓ స్మార్ట్‌ ఫోన్ కొన్నాడు. ‘ఇసాక్ ముండా ఈటింగ్’ పేరుతో యూట్యూబ్‌లో ఛానెల్ స్టార్ట్ చేశాడు. ఆ తరువాత మొదటిసారి రైస్ అండ్ ఇండియ‌న్ సాంబ‌ర్ ఫాస్ట్ ఈటింగ్ పేరుతో నాలుగు నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న వీడియోను రూపొందించాడు. ఒక ప్లేట్ లో అన్నం, పచ్చి టమాటో, పచ్చిమిర్చి కలిపి తింటున్న వీడియో ను పోస్ట్‌ చేశాడు. కొన్నిగంట‌ల‌కే దీనికి బోలెడు వ్యూస్ వ‌చ్చి ప‌డ్డాయి. ఇక అప్ప‌టి నుంచి అతడు వెనుదిరిగి చూడ‌లేదు. ఒక‌దాని త‌రువాత ఒక‌టి వీడియోలు చేస్తూనే ఉన్నాడు. ఇప్ప‌టిదాకా దాదాపు 256 వీడియోలు చేశాడు. అత‌ని యూట్యూబ్‌ ఛాన‌ల్‌కు దాదాపు 7 ల‌క్ష‌ల‌కు పైగా స‌బ్‌ స్క్రైబ‌ర్స్ ఉన్నారు. తొలి వీడియో అప్‌లోడ్‌ చేసిన మూడు నెల‌లకు ఇసాక్‌కు యూట్యూబ్ ద్వారా రూ.37వేలు ఆదాయం వచ్చింది. మ‌రో మూడు నెల‌ల‌కు ఏకంగా రూ.5 ల‌క్ష‌ల సంపాద‌న అందుకున్నాడు.  ఇప్పుడు అతడు నెలకు సూమారు 5 లక్షలు పైగా సంపాదిస్తున్నాడు.

‘’ఆగస్టు 2020లో యూట్యూబ్ నుండి నాకు రూ .5 లక్షల ఆదాయం వచ్చింది. నేను ఆ డబ్బుతో ఒక ఇల్లు నిర్మించాను. ఆర్థిక సంక్షోభం నుండి నా కుటుంబం బయట పడింది. మా గ్రామంలో ప్రజలు జీవనం కోసం వీడియోలు చేస్తాను. నా వీడియోలు వీక్షిస్తున్న వారందరికీ ధన్యవాదాలు’’ అని ఇసాక్ ముండా తెలిపారు.

ఇది కూడా చదవండి: షర్మిల పార్టీకి కాంగ్రెస్ ఎంపీ మద్దతు!

Advertisement

తాజా వార్తలు

Advertisement