ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్యను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల (మంగళవారం) వెల్లడించింది. ఇప్పటి వరకు 275 మరణాలు సంభవించినట్టు తెలిపిన అధికారులు తాజాగా 288కి చేరినట్టు సవరించారు. చీఫ్ సెక్రటరీ పీకే జెనా మీడియాతో మాట్లాడుకు ఈ డిటెయిల్స్ తెలిపారు. ఇప్పటివరకు 288 మందిలో 205 మంది మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారు.
మిగిలిన 83 మృతదేహాల గుర్తింపు కోసం భువనేశ్వర్‌లోని ఎయిమ్స్, ఇతర ఆసుపత్రులలో వివరాలను అందుబాటులో ఉంచినట్లు సీఎస్ జెనా చెప్పారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హెల్ప్ లైన్ నంబర్లపై తమకు చాలా ప్రశ్నలు వచ్చాయని, అన్ని మృతదేహాలను గుర్తిస్తారని తాము ఆశాజనకంగా ఉన్నామని చెప్పారు.. క్షతగాత్రులకు చికిత్స, మృతదేహాలను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అయ్యే ఖర్చును ఒడిశా ప్రభుత్వం భరిస్తోందన్నారు. కాగా, ఒడిశాకు చెందిన 39 మంది మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు సీఎం నవీన్ పట్నాయక్ రూ.1.95 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు.