కరోనా కట్టడి కోసం ఒడిషాలో లాక్‌డౌన్ జులై 1 వరకూ పొడిగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని సడలింపులతో నెలాఖరు వరకూ వారాంతాల్లో కఠిన లాక్‌డౌన్ కొనసాగుతుందని పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చత్తీస్ ఘఢ్, జార్ఖండ్ సరిహద్దులను తెరవాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏపీ, బెంగాల్ సరిహద్దుల్లో నియంత్రణలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని 17 జిల్లాలను ఏ కేటగిరిగా, మిగిలన 13 జిల్లాలను బీ కేటగిరిగా విభజించారు. ఏ కేటగిరిలోని దక్షిణ, పశ్చిమ భాగాలలోని 17 జిల్లాల్లో పాజివిటి రేటు 5 శాతం కంటే తక్కువ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ మహాపాత్ర తెలిపారు. జూలై 1 ఉదయం 5 గంటల రవకు ఆక్షంలు కొనసాగుతాయని వెల్లడించారు. అయితే, శని, ఆదివారం మాత్రం పూర్తి స్థాయి లాడ్ డౌన్ అమలు చేయనున్నట్లు చెప్పారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు 17 జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, 13 జిల్లాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు.
కాగా, ఒడిషాలో బుధవారం 3535 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి ఒక్కరోజులో 44 మంది మరణించారు. అయితే, రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 6.72 శాతంగా ఉందని ప్రభుత్వం తెలిపింది.