Saturday, November 23, 2024

ODI World Cup: హైదరాబాద్ కు ఈసారి మొండిచేయి

వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం రోహిత్‌ సేన అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్‌ దశలో టీమిండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ వేదిక కానుంది. అయితే ఈసారి కూడా ఈ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు ఒక్కటి కూడా హైదరాబాద్ లో జరగకపోవడంతో హైదరాబాద్ కు మొండి చేయే మిగిలింది.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచేస్తున్న భారత్‌, పాకిస్థాన్‌ పోరు అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లోనే జరుగనుంది. బీసీసీఐ ఈ మేరకు ప్రతిపాదిత షెడ్యూల్‌ను ఐసీసీకి అందించింది. ఇతర దేశాల ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న అనంతరం తుది షెడ్యూల్‌ రూపొందించనున్నట్లు సమాచారం. ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం మెగా టోర్నీ ఫైనల్‌ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది. స్వదేశంలో చివరిసారి (2011లో) జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ఈ మెగాటోర్నీకి ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించగా.. క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా మరో రెండు జట్లను నిర్ణయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement