మహానుభావుడు సినిమా సీన్ జరిగింది..ఓసిడి ఉన్నవారికి అన్ని వస్తువులు శుభ్రంగా ఉండాల్సిందే. అదే పని చేసింది ఓ భార్య.. శుభ్రంగా ఉండాలని ఏకంగా లాప్ టాప్ , ఫోన్ ని సర్ఫ్ తో తెగ కడిగింది. మరి అవి పాడవుతాయని ఆవిడకి తెలుసో లేదో కానీ ఆ భర్త విడాకులు కావాలని కోరడం విశేషం.. 35 యేళ్ల మహిళకు తీవ్రమైన అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD)గా అనుమానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె తల్లి మరణించింది. దీంతో ఇంటిని బాగా శుభ్రం చేయాలన్న పేరుతో పిల్లలను, భర్తను 30 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉంచింది. శుభ్రం చేసే క్రమంలోనే టెక్కీ అయిన భర్త లాప్ టాప్, ఫోన్ ని కడిగింది.
దీంతో షాక్ అయిన ఆ భర్త.. covid-19 వ్యాప్తి తర్వాత తన భార్య తీవ్రమైన పరిశుభ్రత అలవాట్లతో విసిగిపోయానంటూ… పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు విఫలమవడంతో, భర్త ఇప్పుడు విడాకులు కోరుతున్నాడు. పోలీసులు ఈ కేసును పరిహార్‌కు రిఫర్ చేశారు. నవంబర్‌లో దీనిమీద పరిహార్ లో మూడు కౌన్సెలింగ్‌లు జరిగాయి. కానీ ఫలించలేదు. మహిళకు ఉన్నది విపరీతమైన OCD అని అనుమానిస్తూ, కౌన్సెలర్ సహాయం తీసుకోవాలని సూచించారు, కానీ ఆమె దీనికి ఒప్పుకోలేదు. తాను బాగానే ఉన్నానని తన పరిశుభ్రత అలవాటు అత్యంత ‘సాధారణం’ అని తెలిపింది. వీరు ఆర్ టి నగర్ కి చెందిన వారు..కాగా ఆఫీస్ ప్రమోషన్ పై ఇంగ్లాండ్ లో వున్నారు. మరి ఈ కేసు ఏం అవుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..