ఓ మహిళతో కాంగ్రెస్ నేత..జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా అశ్లీలంగా వీడియో కాల్ మాట్లాడిన క్లిప్ ని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ లక్షణం అని, ఆ పార్టీ సిగ్గుతో చచ్చిపోవాలని ఆయన కామెంట్స్ చేశారు. అలాగే తాండూరు మర్డర్ కేసును ప్రస్తావిస్తూ పార్టీపై విరుచుకుపడ్డారు. 19 సెకన్ల నిడివి గల ఈ వీడియోను దుబే ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. ‘ఇది కాంగ్రెస్ పాత్ర. ఇది జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా గారి వ్యవహారం. మహిళల ఆత్మగౌరవంతో ఆడుకుంటున్నారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త సుశీల్ శర్మ తన భార్యను తాండూరులో తగులబెట్టారు. ఇది నిజమని తేలితే కాంగ్రెస్ సిగ్గుతో చచ్చిపోవాలన్నారు. ఈ విషయాన్ని గాంధీ కుటుంబం అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఓ ప్రైవేట్ న్యూస్ పోర్టల్ నుంచి తనకు ఈ వీడియో అందిందని, అది ఇంకా తన దగ్గరే ఉందని దూబే చెప్పినట్లు వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపిందని ‘ఏబీపీ లైవ్’ నివేదించింది.
ఈ ఆరోపణలపై జార్ఖండ్ మంత్రి బన్నా గుప్తా స్పందించారు. ఈ వీడియో ఫేక్ అని, దీనిని ఎడిట్ చేశారని తెలిపారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ వీడియోను సర్క్యులేట్ చేశారని చెప్పారు. ఇది కుట్రలో భాగమని, దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని మంత్రి ట్విట్టర్ లో వెల్లడించారు. సోషల్ మీడియాలో నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు, రాజకీయ కక్షతో కొందరు ప్రముఖ రాజకీయ ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఉద్దేశపూర్వకంగా ఫేక్, ఎడిట్ చేసిన వీడియోను వైరల్ చేశారు. ఫోటోషాప్ లేదా మరేదైనా ఎడిటింగ్ యాప్ ద్వారా ఈ తప్పు చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది అని గుప్తా ట్వీట్ చేశారు. నేను పోలీసుకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాను. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేసిన తరువాత కారుకులు ఎవరో తెలుస్తుంది. ఈ నకిలీ, ఎడిట్ చేసిన వీడియో ద్వారా నన్ను ఇరికించేందుకు ప్రయత్నించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.సత్యమేవ జయతే అని మంత్రి బన్నా గుప్తా అన్నారు. మరి నిజా నిజాలు తేలాల్సి ఉండగా..ఈ వీడియో వైరల్ గా మారింది.