Friday, November 22, 2024

ఒమిక్రాన్​ కంటే.. ఓ మిత్రోన్​ చాలా డేంజర్​.. మోడీపై శశిథరూర్​ కామెంట్స్​​..

నిత్యం కొత్త కొత్త పదాలతో ఎప్పుడూ సోషల్​ మీడియాలో ట్రెండ్​ సెట్టర్​గా ఉండే కాంగ్రెస్​ సీనియర్​ నేత శశిథరూర్​ ఇవ్వాల చాలా సీరియస్​ కామెంట్స్​ చేశారు. ప్రధాని మోడీ నిత్యం తన ప్రసంగాల్లో వాడో పదాలను వైరస్​తో పోలుస్తూ ట్వీట్​ చేశారు. అంతేకాకుండా ఓమిక్రాన్​ వైరస్​కి ట్రీట్​మెంట్​ ఉందోమో కానీ, ప్రధాని మోడీ వాడే ఓ మిత్రోన్​ కి మాత్రం ఎటువంటి వ్యాక్సిన్​ లేదని సెటైర్​ వేశారు.

దేశాన్ని ఉద్దేశించి తన ప్రసంగాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కువగా ఉపయోగించే పదాలు.. ఆయన మాటల్లోనే ఎంతో ఫేమస్​ అయిన ‘మిత్రోన్’పై ఇవ్వాల కాంగ్రెస్​ సీనియర్​ నేత శశిథరూర్​ సెటైర్​ వేశారు.  ఓమిక్రాన్ కంటే ‘ఓ మిత్రాన్’ చాలా ప్రమాదకరమని శశిథరూర్​కామెంట్స్​ చేశారు.  ‘‘Omicron కంటే చాలా”O Mitron” చాలా డేంజర్​. దేశ ప్రజల్లో రాజుకుంటున్న ద్వేషం, మతోన్మాదాన్ని ప్రోత్సహించడం, రాజ్యాంగంపై దాడులు, ప్రజాస్వామ్యం బలహీనపడటం వంటి పరిణామాలను రోజూ గమనిస్తున్నాం. ఒమిక్రాన్​కు ట్రీట్​మెంట్​ ఉంది.. టీకా ఉంది.. కానీ ఓ మిత్రోన్​ వైరస్‌కు ఎటువంటి టీకా కనిపెట్టలేదు. ఇది తేలికపాటి వైరస్​ అంతకంటే కాదు” అని ఆయన ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్​ చేస్తూ.. దేశంలోని తీవ్రమైన కొవిడ్ పరిస్థితిని తేలికపరచడానికి ఇది ఒక ప్రయత్నం అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement