పొద్దాక, తెల్లందాక స్మార్ట్‌ఫోన్ వదలకుండా పోరగాళ్లు ఏం చేస్తున్నారా అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. తల్లిదండ్రుల్లో కొంతమంది ‘‘ఏముందిలే గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు అనుకుంటే.. ఇంకొంతమంది సినిమాలు, షార్ట్ ఫిల్ములు చూస్తూ ఉంటారు లే’’ అని కామన్‌గా తీసుకుంటారు. కానీ, ఇది విపరీత ధోరణిగా మారి.. చెడు అలవాట్లకు దారితీస్తున్నట్టు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తెలియజేస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఎక్కువగా యూత్ పోర్న్ వీడియోలు చూడ్డానికి అలవాటు పడి.. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన గ్యాంగ్ రేప్‌తో పాటు పలు ఇన్సిడెంట్లు ఇదే అసలైన కారణమని తెలియజేస్తున్నాయి.
ఇక.. ఈ మధ్య కాలంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొంతమందికి గర్ల్స్ వీడియో కాల్స్ చేస్తున్నట్టు పోలీసుల పరిశీలనలో తేలింది. రాత్రి పది గంటలు దాటిన తర్వాత వీడియో న్యూడ్ కాల్స్ చేస్తూ యువకుల బలహీనతను క్యాష్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ కొత్త కొత్త నెంబర్ల నుంచి వాట్సాప్ మెస్సేజ్‌లు పంపి ముందుగా వారితో చాటింగ్ మొదలుపెడుతున్నారు. ఆ తర్వాత ఇటువైపు నుంచి కాస్త రెస్పాన్స్ రాగానే వీడియో కాల్స్ చేస్తూ యువకులను ఆటపట్టిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ వంటి ఉత్తరాది ప్రాంతాల నుంచే ఇట్లాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తోంది. ముందు హాయ్ అంటూ మొదలయ్యే కథ.. ఆ తర్వాత న్యూడ్ కాల్స్ దాకా వెళ్తున్నట్టు సమాచారం..
ఆ తర్వాత యువకుల న్యూడ్ వీడియోలను రికార్డు చేసి వారితో బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నట్టు మోసపోయిన కొంతమంది బాధితుల ద్వారా తెలుస్తోంది. పేరు చెప్పుకోవడానికి, పోలీసులకు కంప్లెయింట్ చేయడానికి ఇష్టపడని చాలామంది యువకులు ఇదే తరహా మోసాలకు నష్టపోయామని ఒకరికొకరు చెప్పుకుని ఆవేదన చెందుతున్నారు. 100 రూపాయల నుంచి మొదలుకుని 250 రూపాయలు చెల్లించి తమతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడొచ్చని కొంతమంది గర్ల్స్ ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందుగా న్యూడ్ ఫొటోలు పంపించి యువకుల బలహీనతపై దెబ్బకొడుతున్నారు. ఇక చేసేదేం లేక కొంతమంది యువకులు వారు అడిగినంత ఇచ్చుకుని వీడియో కాల్స్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇట్లా హైదరాబాద్ సిటీలో రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోందని, ఇప్పటికే లక్షలాది మంది ఉత్తరాది రాష్ట్రాల యువతుల న్యూడ్ వీడియో కాల్స్ మోసానికి నష్టపోయినట్టు సమాచారం.