Friday, November 22, 2024

Spl Story: న్యూడ్​ వీడియో కాల్స్​.. 10 తర్వాత పరేషాన్​, రెచ్చగొడుతున్న గర్ల్స్​!

పొద్దాక, తెల్లందాక స్మార్ట్​ఫోన్​ వదలకుండా పోరగాళ్లు ఏం చేస్తున్నారా అన్న సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. తల్లిదండ్రుల్లో కొంతమంది ‘‘ఏముందిలే గేమ్స్​ ఆడుకుంటూ ఉంటారు అనుకుంటే.. ఇంకొంతమంది సినిమాలు, షార్ట్​ ఫిల్ములు చూస్తూ ఉంటారు లే’’ అని కామన్​గా తీసుకుంటారు. కానీ, ఇది విపరీత ధోరణిగా మారి.. చెడు అలవాట్లకు దారితీస్తున్నట్టు ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు తెలియజేస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఎక్కువగా యూత్​ పోర్న్​ వీడియోలు చూడ్డానికి అలవాటు పడి.. ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లో జరిగిన గ్యాంగ్​ రేప్​తో పాటు పలు ఇన్సిడెంట్లు ఇదే అసలైన కారణమని తెలియజేస్తున్నాయి.

ఇక.. ఈ మధ్య కాలంలో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొంతమందికి గర్ల్స్​ వీడియో కాల్స్​ చేస్తున్నట్టు పోలీసుల పరిశీలనలో తేలింది. రాత్రి పది గంటలు దాటిన తర్వాత వీడియో న్యూడ్​ కాల్స్​ చేస్తూ యువకుల బలహీనతను క్యాష్​ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రోజు రోజుకూ కొత్త కొత్త నెంబర్ల నుంచి వాట్సాప్​ మెస్సేజ్​లు పంపి ముందుగా వారితో చాటింగ్​ మొదలుపెడుతున్నారు. ఆ తర్వాత ఇటువైపు నుంచి కాస్త రెస్పాన్స్​ రాగానే వీడియో కాల్స్​ చేస్తూ యువకులను ఆటపట్టిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్​ వంటి ఉత్తరాది ప్రాంతాల నుంచే ఇట్లాంటి కాల్స్ ఎక్కువగా​ వస్తున్నట్టు తెలుస్తోంది. ముందు హాయ్​ అంటూ మొదలయ్యే కథ.. ఆ తర్వాత న్యూడ్​ కాల్స్​ దాకా వెళ్తున్నట్టు సమాచారం..

ఆ తర్వాత యువకుల న్యూడ్​ వీడియోలను రికార్డు చేసి వారితో బ్లాక్​ మెయిల్​కు దిగుతున్నట్టు మోసపోయిన కొంతమంది బాధితుల ద్వారా తెలుస్తోంది. పేరు చెప్పుకోవడానికి, పోలీసులకు కంప్లెయింట్​ చేయడానికి ఇష్టపడని చాలామంది యువకులు ఇదే తరహా మోసాలకు నష్టపోయామని ఒకరికొకరు చెప్పుకుని ఆవేదన చెందుతున్నారు. 100 రూపాయల నుంచి మొదలుకుని 250 రూపాయలు చెల్లించి తమతో న్యూడ్​ వీడియో కాల్స్​ మాట్లాడొచ్చని కొంతమంది గర్ల్స్​ ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ముందుగా న్యూడ్​ ఫొటోలు పంపించి యువకుల బలహీనతపై దెబ్బకొడుతున్నారు. ఇక చేసేదేం లేక కొంతమంది యువకులు వారు అడిగినంత ఇచ్చుకుని వీడియో కాల్స్​లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఇట్లా హైదరాబాద్​ సిటీలో రోజు రోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోందని, ఇప్పటికే లక్షలాది మంది ఉత్తరాది రాష్ట్రాల యువతుల న్యూడ్​ వీడియో కాల్స్​ మోసానికి నష్టపోయినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement