(హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి) – రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ పట్ల అత్యంత గౌరవ, వినయ విధేయతలుండేవి. ఎన్‌టీఆర్‌ను కేసీఆర్ ఒక మార్గదర్శకుడి గా భావించేవారు. తన కుమారుడికి తారక రామారావు పేరు పెట్టు కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్ణయాలు, సంస్క రణల్లో ఎన్‌టీఆర్ ప్రభావం కనిపిస్తోంది. పాలనా వికేంద్రీకరణ, సంక్షేమం, రైతులు, మ#హళలు, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీల జీవన ప్రమాణాల్ని పెంచే పథకాలన్నింటి వెనుక ఆయనలో ఎన్‌టీఆర్ స్ఫూర్తి ద్యోతకమౌతోంది. ఇక తాజాగా భారత్ భవన్ పేరిట కేసీఆర్ నిర్మిస్తున్న పార్టీ జాతీయ కార్యాలయంలో నిర్వ #హణా విభాగాలతోపాటు క్రమం తప్పకుండా రాజకీయ శిక్షణా తరగతులను నిర్వ#హంచాలన్న నిర్ణయం మరోసారి ఎన్‌టీఆర్‌ను గుర్తుకు తెస్తోంది. కేసీఆర్ ప్రతిపాదనతో తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు, తొలి తరం నాయకులకు ఆనాటి శిక్షణా తరగతులు గుర్తు కొస్తున్నాయి. ఎన్‌టీఆర్ తొలి ఎన్నికల్లో 90శాతానికి పైగా రాజకీయ నేపథ్యం లేని వారికే టిక్కెట్లిచ్చారు. ఎన్‌టీఆర్ పేరు, చరిష్మా, విధివిధానాలు, ఆత్మగౌరవ నినాదాలతోనే వీరంతా గెలిచి చట్టసభలకొచ్చేశారు. అభ్యర్థుల ఎంపికలో అనుభవం కంటే నిజాయితీ, నిబద్దత, వ్యక్తిగత చరిత్రలకు పెద్దపీటేసిన ఎన్‌టీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని కాలానుగుణ రాజకీయ నాయకులుగా కాకుండా దూరదృష్టి కలిగిన రాజకీయ వేత్తలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.
ఇందుకోసం అప్పటి వరకు #హమాయత్ నగర్‌లో ఉన్న తెలుగుదేశం ప్రధాన కార్యాలయాన్ని గండిపేటకు మార్చారు. అక్కడ శాసనసభ్యులు, మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకుల శిక్షణకు వసతులు కల్పించారు కనీసం వందమంది బసకు ఏర్పాట్లు చేశారు. అనంతరం శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఇందుకోసం సిలబస్ కూడా రూపొందించారు. పార్టీ వ్యూహాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై వివిధ విభాగాలకు చెందిన నిపుణుల్ని రప్పించి తరగతుల్లో పాఠాలు చెప్పించారు. జాతీయ స్థాయి సోషలిస్ట్ నాయకులు మధుదండావతే, జార్జ్‌ఫెర్నాండేజ్‌లతో పాటు చంద్రశేఖర్, వాజ్‌పేయి తదితరుల్ని కూడా తరగతుల నిర్వ#హణకు ఆహ్వానించారు. పదవీ విరమణ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఉన్నతోద్యోగులతో ఆర్థిక పాఠాలు చెప్పించారు. రాజ్యాంగ నిపుణులతో రాజ్యాంగ అంశాలపై అవగా#హన కల్పించారు. తుమ్మల చౌదరి, మింటే పద్మనాభం, కృష్ణమూర్తి, అట్లూరి వెంకటేశ్వరరావు, తుర్లపాటి సత్యనారాయణలు ఈ శిక్షణా కార్యక్రమాలకు దిశానిర్దేశకులుగా ఉండేవారు. వ్యక్తిత్వవికాసం కోసం డాక్టర్ బివి పట్టాభిరామ్‌తో పాఠాలు చెప్పించేవారు. ఈ కేంద్రంలో ఉపన్యాసాల్లో పోటీలు కూడా నిర్వ#హంచేవారు. ప్రతిపక్షాల విమర్శలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలో నేర్పేవారు. మీడియాతో ఎలా వ్యవ#హంచాలన్న దానిపై శిక్షణిచ్చేవారు.
ఆధ్యాత్మిక, యోగాలకు సంబంధించి కూడా తరగతులుండేవి. ప్రతినెలా క్రమం తప్పకుండా ఈ తరగతులు జరిగేవి. ఎన్‌టీఆర్ స్వయంగా ఈ తరగతులకు హాజరై విద్యార్థుల తరహాలో ఈ పాఠాల్ని సునిశితంగా వినేవారు. అప్పట్లోనే కేసీఆర్ ఈ తరగతుల నిర్వ#హణలో భాగస్తులయ్యారు. అనంతర కాలంలో ఆయన శిక్షణా తరగతులకు మార్గదర్శకుడయ్యారు. అప్పటి నుంచి ఔత్సా#హక రాజకీయ నాయకుల్ని రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దడంలో కేసీఆర్‌కు ఆసక్తి ఉండేది. సొంత పార్టీ ఏర్పాటు అనంతరం కూడా ఆయన ఈ విధానాల్ని అనుసరించారు. కాగా ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ విస్తరణకు శ్రీకారం చుట్టాక తిరిగి రాజకీయ శిక్షణా తరగతుల నిర్వ#హణకు సిద్ధంకావడం భావితరాలకు మెరుగైన, ఆలోచనాపరులైన రాజకీయవేత్తల్ని అందించాలన్న కేసీఆర్ లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. పక్కా ఇళ్లు, కిలో రెండ్రూపాయల బియ్యం పథకం ద్వారా ఆహార భద్రత, చేనేతలకు ఉపాధి కల్పన వంటివన్నీ కూడా ఎన్‌టీఆర్ మదిలో పుట్టిన ఆలోచనలే. ఇప్పుడు వీటన్నింటిని కేసీఆర్ అనుసరిస్తున్నారు.