బ్యాంకు రుణాల ఎగవేతలు లక్షల కోట్లున్నయ్.. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఉద్దీపనల పేరుతో లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు. ఇట్లా ఎన్‌పీఏల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోల్‌మాల్ చేస్తోంది. ఇదో పెద్ద కుంభకోణం.. లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు ఇట్లా చేస్తున్నారు. పేదల నోర్లు కొట్టి పెద్దలకు పెడుతున్నారు. రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీలు వద్దంటూ.. కేంద్రం కొంతమంది కార్పొరేట్లకు లక్షల కోట్లు ఇట్లా సాయం చేస్తోంది. అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రేపు జరగబోయే నీతి ఆయోగ్ భేటీకి తెలంగాణ నుంచి హాజరు కావడం లేదని, దీనిపై దేశవ్యాప్త చర్చ గాలన్నదే తమ ఆకాంక్షగా చెప్పారు. శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా మీట్‌లో చాలాసేపు మాట్లాడారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, నీతి ఆయోగ్ వంటి అంశాలపై కూలంకశంగా మాట్లాడారు.
Big Breaking: ఎన్‌పీఏ పెద్ద కుంభకోణం.. లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్లాన్
Advertisement
తాజా వార్తలు
Advertisement