దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో.. మరో కొత్త రకం వ్యాధికి సంబంధించిన వార్త కలవరపెడుతోంది. ఓవైపు దేశం కరోనాతో విలవిలలాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ ప్రజలను కలవరపెడుతోంది. దేశ నలుమూలలా బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త వ్యాధి బయటపడింది. దాని పేరు ‘వైట్ ఫంగస్’. బిహార్లో 4 వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా లక్షణాలతో పట్నాలోని వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవలే నలుగురు చేరారు. వారికి పరీక్షలు చేయగా.. కరోనా నెగిటివ్గా తేలింది. దీనిపై అక్కడి వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. విస్తృతంగా పరీక్షించి.. వారికి వైట్ ఫంగస్ సోకిందని నిర్ధరించారు. వైట్ ఫంగస్ రోగుల్లో ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉంటాయి. వాటితో పాటు శరీరంలోని అనేక అవయవాలపై ఈ ఫంగస్ ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చర్మం, గోళ్లు, నోటి లోపలి భాగం, కిడ్నీలు, మెదడుపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే బ్లాక్ ఫంగస్ కన్నా ఈ వైట్ ఫంగస్ ప్రమాదకరం కాదని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్ను ప్రమాదకర జబ్బుగా గుర్తించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం