Tuesday, November 26, 2024

Big Story | ఇక.. అందుబాటులోకి ఇందిరమ్మ వరదకాలువ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 1996 నుంచి పెండింగ్‌ లో ఉన్న ఇందిరమ్మ వరద ప్రవాహ కాలువ ఫైళ్ల దుమ్ము దులిపి పనుల్లో వేగం పెంచింది తెలంగాణ ప్రభుత్వం. శ్రీరాంసాగర్‌ దిగువ తీరం నుంచి గోదావరి నదిలోని 20 టీఎంసీ వరదనీటిని వినియోగించుకుంటూ కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో అనావృష్టికి గురయ్యే ప్రాంతాల్లో 2.2000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టు డిజన్‌ మార్చి నీటిపారుదల శాఖ పనులను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకు 1996లో రూ. 1331.30 కోట్ల అంచనా వ్యవయంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు రూపకల్పనచేసింది. అనంతరం సవరించిన అంచనావ్యయంతో పనులు ప్రారంభించేందుకు నీటిపారుదల శాఖకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.

అయితే బడ్జెట్‌ కేటాయింపులేకానీ పనుల్లో పురోగతి లేకపోవడంతో ఆశించిన ఫలితాలు అందుబాటులోకి రాక వరదనీరు సముద్రంలో కలిసి పోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలసంఘం 128 సాంకేతిక కమిటీలో ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాలతో అనుమతి సాధించి పనులుప్రారంభించింది. జిఓ 978 మేరకు రూ. 9,886.19కోట్ల కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చాజెండాఊపి అవాంతరాలను అదిగమిస్తూ పనులు చేస్తుంది. రీఇంజనీరంగ్‌ మేరకు కరీంనగర్‌ జిల్లాలో 95.373 ఎకరాలకు,సిద్దిపేటలో 83,905,హన్మకొండ 37,05ఎకరాలకు,జనగమకు 33.824 ఎకరాలకు, రాజన్న సిరిసిల్లలో ఆయకట్టుకు సాగునీటిని అందించడానికి ప్రాజెక్టు ప్రతిపాదించారు.

నూతన ఆయకట్టుకు స్థిరీకరణ..
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నీటిని సమర్దవంతంగా వినియోగించుకోవడంతో పాటుగా నూతన ఆయకట్టు కల్పనకు కొనసాగుతున్న నిర్మిస్తున్న ప్రధాన కాలువల విభాగాల వరద కాలువల ద్వారా 122 కిలోమీర్ల దగ్గర మిడ్‌ మానేరు జలాశయం కుడి,ఎడమ కాలువలతో కలిపి గౌరవెల్లి జలాశయం కు ఏత్తిపోస్తారు. ఈ నీటిని ఆధారంగా చేసుకుని మోతే రిజర్వార్‌ నిర్మాణాన్ని వేగంచేసి నీటిని వినియోగిస్తారు. ఇందిరమ్మ వరద ప్రవాహకాలువ 130 కిలోమీటర్ల పొడవు తో నిజామాబాద్‌ లోని సంఘం గ్రామం నుంచి కరీంనగర్‌ జిల్లాలోని మన్వాడ గ్రామం లోని మధ్య మానేరు ఆనకట్టవరకు విస్తరిస్తుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలంలో గోదావరి నుంచి సుమారుగా 3,073,259 టీఎంసీలు వరదలతో సముద్రంలో కలుస్తున్నాయి.

- Advertisement -

ఈ వరదప్రవాహాన్ని కొద్దిమేరకైన నిలువరించేందుకు ఇందరమ్మ వరద కాలువ ఉపయోగపడుతుందని జలనిపుణులు భావిస్తున్నారు. ఈ కాలువద్వారా ప్రస్తుతం 2.20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు దాదాపుగా పూర్తి అయినప్పటికీ 2.59.296 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రాజెక్టు సామర్థ్యం పెంచి పనులు చేస్తున్నారు. 1.41టీఎంసీలనుంచి 8.23 టీఎంసీలకు నీటి సామర్థ్యం పెంచారు.

రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర నీటివనరుల మౌళిక అభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా జాీయ బ్యాంకు,రూరల్‌ బ్యాంకుల నుంచి రుణాలు స్వీకరించేందుకు నివేదికలు సిద్ధంచేసింది. ఇందిరమ్మ వరద ప్రవాహ కాలలువ పనుల్లో రూ.8138.32 కోట్ల కాలువనిర్మాణ పనులు జరిగాయి. అలాగే ఎత్తిపోతల ప్రాజెక్టుల కోసం రూ. 9969.98 కోట్ల పనులు జరిగాయి. ప్రస్తుతం 50.300 ఎకరాలకు అవసరమైన నీటిని సామర్థ్యంఅందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా 2.08.996 ఎకారాలకు నీరు అందించేందుకు పనులు పూర్తి కావల్సి ఉంది.

కడలిలో కలిసే నీటికి అడ్డుకట్టవేసి ఇందిరమ్మ వరద ప్రవాహకాలువద్వారా నీరందించేందుకు ప్రభుత్వం పనుల్లో వేగం పెంచి ప్రస్తుత సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్లుతుంది. ఈ ప్రయోగం విజయవంతంగా ముగించి నిబంధనలమేరకు గోదావరినుంచి తెలంగాణకు చెందాల్సినవరదజలాలకు అడ్డుకట్టలు వేసి మరిన్ని ఎత్తిపోతల పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషీ ఫలిస్తే తెలంగాణ పచ్చదనం పులుముకుని పరవశించే రోజులు కనుచూపుమేరల్లో ఆవిష్కృతం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement