Friday, November 22, 2024

Notification: ఆర్మీ స్కూల్ లో చదవాలనుకునే బాలికల కోసం..

ఆర్మీ స్కూల్ లో చదివించాలనే బాలికలకు గుడ్ న్యూస్.. డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో బాలికల ప్రవేశం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 7వ తరగతి పాస్ అయిన విద్యార్థినులు 8వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ మేరకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తిగ‌ల స్టూడెంట్స్ ఆర్ ఎంసీ వెబ్ పోర్టల్లో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ సహా ప్రాస్పెక్టస్, ఓల్డ్ మోడల్ పేపర్స్ ఉన్నబుక్ లెట్ పొందవచ్చు.

ఇదే విషయంపై టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ స్పందిస్తూ.. అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in, rimc.gov.in ను సందర్శించవచ్చని తెలిపారు. తెలంగాణకు చెందిన బాలికలు తమ అప్లికేషన్ ఫార్మ్స్ ను నవంబరు 15లోగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి పంపించాలన్నారు. హైదరాబాద్‌లో డిసెంబరు 18న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

దరఖాస్తులు చేసుకునే విధానం:
ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2022 జులై 1 నాటికి 7వ త‌ర‌గ‌తి పాస్ అయ్యి ఉండాలి.
2009 జులై 2 కంటే ముందు.. 2011 జనవరి 1 తర్వాత జన్మించి ఉండకూడదు.
దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.555

దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా:
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్,
ప్రతిభ భవన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్

Advertisement

తాజా వార్తలు

Advertisement