షిరిడీ (ప్రభ న్యూస్) : రేపు చంద్రగ్రహణం కారణంగా షిరిడీ సాయిబాబా మందిరం మూసివేయనున్నట్టు సంస్థాన్ ట్రస్ట్ వెల్లడించింది. ఈ మేరకు సాయి భక్తులకు షిరిడీ ఆలయ సూపరింటెండెంట్ భాగ్యశ్రీ బనాయత్ ఓ సూచన చేశారు. బాబాఇనిస్టిట్యూట్ ట్రస్ట్, షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీలో రేపు (మంగళవారం) చంద్రగ్రహణం కారణంగా ఉదయం నుంచి దర్శనం ఉండబోదని తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 02:30వరకు సాయి సన్నిధిలో మంత్రోచ్ఛారణ జరుగుతుందని.. ఆ తర్వాత బాబా మంగళస్నానం ప్రారంభమవుతుందని ట్రస్ట్ తెలిపింది. ఇక.. 3 గంటల నుంచి 6.19 వరకు… సాయంత్రం 4 గంటల నుంచి 6.30వరకు, 5 గంటల నుంచి 6.45 వరకు “షిరిడీ మజే పంఢరపూర్” ఆర్తి. ధూపరాతి ప్రారంభమవుతుందని బాబా ట్రస్ట్ అధికారులు తెలిపారు. కాగా, 6 గంటల నుంచి 7 గంటల వరకు సమాధి ఆలయ ఆడిటోరియం నుంచి మంత్రోచ్ఛారణ వరకు సాయి భక్తుల దర్శనం కొనసాగుతుందని ఆలయ సూపరింటెండెంట్ తెలిపారు.