Friday, November 22, 2024

Live Update | రాజకీయం చేయాల్సిన సమయం కాదు.. రీస్టోరేషన్​పై దృష్టిపెడుతున్నాం: వైష్ణవ్​

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ప్రమాదం తర్వాత ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్​ వినిపిస్తోంది. అయితే.. దీనిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ స్పందించారు. ఇది రాజకీయం చేయడానికి తగిన సమయం కాదని, దయచేసి అన్ని పార్టీల లీడర్లు ఈ విషయంలో సహకరించాలని కోరారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు ట్రీట్​మెంట్​, మృతదేహాలను వారి కుటుంబాలకు చేరవేయడంతోపాటు.. అర్జంటుగా ట్రాక్​ పునరుద్ధరణ పనులపై దృష్టిపెడుతున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్​ తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడినట్టు అధికారికంగా వెల్లడించారు. కాగా, అనేక ప్రతిపక్ష పార్టీలు కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో వైష్ణవ్​ ఇది రాజకీయం చేయాల్సిన సమయం కాదని వ్యాఖ్యానించారు.

- Advertisement -

అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. “మన వ్యవస్థ సురక్షితంగా ఉందని, ఏదైనా తీవ్రమైన ప్రమాదం జరగదని రైల్వే మంత్రి పదేపదే చెబుతున్నప్పుడు, ఇది ఎలా జరిగింది? లాల్ బహదూర్ శాస్త్రి గతంలో రైలు ప్రమాదంలో తన పదవికి రాజీనామా చేశారు. మేము అలా చేయలేదు. ప్రధాని మోదీ కేబినెట్ నుండి దీనిని ఆశించండి, కానీ అతనికి (అశ్విని వైష్ణవ్) కొంచెం అవమానం ఉంటే, అతను రాజీనామా చేయాలి. అని ట్వీట్​ చేశారు.

రైల్వే శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రెండుసార్లు రైల్వే మంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ.. ‘నేను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అమర్చాలని నిర్ణయించుకున్న యాంటీ కొలిజన్ డివైజ్ ఇప్పుడు లేదు అన్నారు. రైలు ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఒక గూడ్స్ రైలు ఉన్నాయి. కోల్‌కతాకు దక్షిణాన 250 కి.మీ.. భువనేశ్వర్‌కు ఉత్తరాన 170 కి.మీ దూరంలో ఉన్న బాలాసోర్‌లోని బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో నిన్న (శుక్రవారం) రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా, శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement