రష్యాతో జరుగుతోన్న యుద్ధంలో వైమానిక క్షేత్రాలను చేజిక్కించుకునేందుకు యుద్ధ విమానాలు కావాలని గత కొన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ అమెరికాని కోరుతోంది. అమెరికాకు చెందిన ఎఫ్16 యుద్ధ విమానాలకు ప్రత్యేకత ఉంది. అత్యంత నమ్మకమైన ఫైటర్ జెట్స్‌గా వాటిని భావిస్తారు. బెల్జియం, పాకిస్థాన్ దేశాలు ఆ విమానాలను కలిగి ఉన్నాయి. వార్‌లో నెగ్గాలంటే ఆ విమానాలు కావాలని జెలెన్‌స్కీ అమెరికాను కోరారు.కాగా ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపడం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. వైమానిక సపోర్ట్ ఇవ్వాలంటూ అమెరికాను ఉక్రెయిన్ కోరుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బైడెన్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్న వేశారు. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు లేదని బైడెన్ సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపడంలేదని జర్మనీ కూడా రెండు రోజుల క్రితం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఒకవేళ ఉక్రెయిన్‌కు ఆ యుద్ధ విమానాలు వస్తే, అప్పుడు రష్యాపై ఆ దేశం ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉంటాయి. రష్యా వద్ద సోవియేట్ కాలం నాటి యుద్ధ విమానాలు ఉన్నాయి. కానీ అమెరికా మాత్రం ఎఫ్16 విమానాలను ఉక్రెయిన్‌కు అప్పగించేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. కేవలం అబ్రామ్ ట్యాంక్‌లను మాత్రం అమెరికా పంపనున్నట్లు తెలుస్తోంది.