Friday, November 22, 2024

స్టూడెంట్స్‌ని కూలీలుగా మారుస్తారా? గురుకులాలు ఎందుకు ఓపెన్ చేయ‌డం లేద‌న్న బీఎస్పీ నేత‌ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థులను కూలీలుగా మార్చేలా వ్యవహరిస్తోందని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్‌లో విమ‌ర్శించారు. రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రయివేట్ విద్యా సంస్థలను రీ ఓపెన్ చేసినా. రెసిడెన్షియ‌ల్స్ విషయంలో స‌ర్కారు ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. లక్షలాది పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలు, హాస్టళ్ల పునఃప్రారంభంపై కేసీఆర్ మౌనం ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్రని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు.

ఇలాంటి వైఖరితో పిల్లలు భూస్వాముల ఇళ్లు, భూముల్లో కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గడీల పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలంటూ ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. ‘లక్షలాది పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలు, హాస్టళ్లను పునఃప్రారంభించడంపై కేసీఆర్‌ ప్రభుత్వం మౌనం మళ్లీ ఒక తరాన్ని భూస్వాముల భూముల్లో కూలీలుగా, ఇళ్లలో పనిచేసే పనిపిల్లలుగా మార్చే కుట్ర తప్ప మరొకటికాదు.. గడీల పాలన నుంచి తల్లి తెలంగాణను విముక్తి చేయవలసిన సమయం ఆసన్నమైంది’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement