రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు కనీస మద్దతు ధర 15వేల రూపాయలు నేరుగా వారి ఖాతాలోకి చేరేలా ఇప్పుడే డిక్లేర్ చేశాం. పార్టీ లీడర్ రేవంత్‌రెడ్డి ఇప్పుడే వివరించారు. ఇది కేవలం డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని ప్రతి రైతు చదవాలే, ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ అని తెలియజేస్తున్నా. ఈ రో్జు మేము చెప్పదలచుకున్నదొక్కటే.. ఈ రోజు రైతులు బలహీన పడ్డారు. వారికి పునాధిగా వ్యవసాయ పరంగా వారికి సపోర్టుగా ఉండేలా ఈ డిక్లరేషన్ ఉంటుంది.
మిమ్ములను ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను. ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన మోసం చేశారని, తెలంగాణ ప్రజల కలను ఎవరు మోసం చేశారని, వేల కోట్ల అవినీతి ఎవరు చేశారు, దీనికి కారకులెవరు, నష్టం చేసిందెవరు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి గట్టిగా మీరే చెప్పాలి. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆలోచన చేయాలే. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారిని, ప్రజల కలలను మోసం చేసిన వారితో మనకు ఎలాంటి సంబంధం ఉండబోదని పార్టీ తరపున తెలియజేస్తున్నా.
కాగా, రాహుల్ గాంధీ హిందీ ప్రసంగానికి పార్టీ లీడర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలుగులో అనువాదం చేశారు.