Tuesday, November 26, 2024

పార్ల‌మెంట్ భ‌వ‌నాన్ని ప్రారంభించాల్సింది మోడీ కాదు: రాహుల్ గాంధీ

కొత్త పార్లమెంట్ భ‌వ‌నాన్ని ప్రారంభించాల్సింది ప్ర‌ధాని మోడీ కాద‌ని రాష్ట్ర‌ప‌తి అని తెలిపారు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ. ఈ మేర‌కు నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలే.. కానీ, ప్రధానమంత్రి కాదు’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కాగా మోడీ నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోడీని కలిశారు. నూతన పార్లమెంటు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయాలని, ఆ భవనాన్ని ప్రారంభించాలని కోరినట్టు లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

నూతన పార్లమెంటు భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో సౌకర్యవంతంగా 888 మంది సభ్యులు కూర్చోవచ్చు. అదే రాజ్యసభ చాంబర్‌లో 300 మంది కూర్చోవచ్చు. ఒక వేళ రెండు సభల సభ్యులు కూర్చోవాలనుకుంటే.. మొత్తం 1,280 మంది సభ్యులు లోక్‌సభ చాంబర్‌లో కూర్చునే వీలు ఉంది. 2020 డిసెంబర్ 10వ తేదీన నూతన పార్లమెంటు భవన నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ భవనం స్వల్ప సమయంలో ఎన్నో హంగులతో నిర్మితమైందని లోక్‌‌సభ సెక్రెటేరియట్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement