ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి భార్య సుధామూర్తి. విద్యావేత్త, రచయిత, అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా పేరు పొందారు. సుధామూర్తి.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వైవాహిక, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 1981లో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆయనకు పనే జీవితమైపోయిందన్నారు. అంకితభావంతో పనిచేసేవారని చెప్పారు. ఎప్పుడూ బిజీగా ఉండేవారని.. సెలవులే ఉండేవి కాదన్నారు. అందువల్ల 30 ఏళ్ల పాటు తామిద్దరం కలిసి ఒక్క వెకేషన్‌కు కూడా వెళ్లలేదని తెలిపారు. నారాయణమూర్తి ఏడాదికి 220 రోజుల పాటు ప్రయాణాలు చేసేవారని చెప్పారు. ఇంటికి సంబంధించిన విషయాలను పూర్తిగా తనపైనే వదిలేశారని, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు తెలిసేది కాదన్నారు. పిల్లలిద్దరి బాధ్యతను కూడా పూర్తిగా తనపైనే వదిలేశారన్నారు. పిల్లలిద్దరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత నేను ఆయనకు ఎంత మద్దతిచ్చానో మూర్తికి అర్థమైందన్నారు. అప్పటి నుంచి తన కెరీర్‌ను కొనసాగించేందుకు అన్ని విధాలా సపోర్ట్‌గా నిలుస్తున్నారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement