Saturday, November 23, 2024

ఎవరెస్ట్ పర్వతం ఎక్కిన వ్యక్తికి కరోనా!

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే విదేశీయులు కరోనా బారిన పడుతున్నారు. ఇన్నాళ్లు కరోనాకు దూరంగా ఉన్న ఈ శిఖరంపైకి కూడా ఇప్పుడు కొవిడ్-19 చేరిపోయింది. కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు ఎవరెస్ట్ వద్ద పర్వతారోహణను నిలిపేశారు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్యే పర్వాతారోహణకు నేపాల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకొని పర్వతం ఎక్కినప్పటికీ, ఓ పర్వతారోహకుడికి కరోనా సోకడం కలకలం రేపింది. నార్వేకు చెందిన ఎర్లెండ్ నెస్, ఎవరెస్ట్ పై కరోనా సోకిన మొదటి విదేశీ వ్యక్తిగా గుర్తింపు పొందాడు.  ఎవరెస్ట్ కు వెళ్లిన ఎర్లెండ్ నెస్ మార్గమధ్యంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడ్ని హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ లో ఖాట్మాండు తీసుకొచ్చి పరీక్షించగా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఏప్రిల్ 15న ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, గురువారం(ఏప్రిల్ 22) నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతంలో అతను నెపాల్ లోనే ఉన్నాడు.

కరోనా వైరస్ వందలాది ఇతర ఎవరెస్ట్ అధిరోహకులు వ్యాపించే అవకాశం ఉందని గైడ్ అస్టియన్ లుకాస్ తెలిపాడు. ఎవరెస్ట శిబిరాల్లో ఉన్న వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నాడు. బేస్ క్యాంపులో ఉన్న తమకు అత్యవసరంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరాడు. కాగా, ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో పర్వతంపై కరోనా సోకిన మొదటి విదేశీయుడిగా నెస్ గుర్తింపు పొందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement