ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన ట్వీట్ చేశాడు. హిందీలో దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లతో దూసుకెళ్తుండడంతో బాలీవుడ్ స్టార్ హీరోలకు అసూయ పెరిగిపోతోందని ఆయన అన్నారు. దక్షిణాది..ఉత్తరాది కాదని, భారతదేశం మొత్తం ఒక్కటనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పేర్కొన్నారు. ‘‘ప్రాంతీయత, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా భాషలు వృద్ధి చెందాయి. భాష.. ప్రజలు దగ్గరయ్యేందుకు ఉపయోగపడాలి కానీ.. విడదీసేందుకు కాదు’’ అని ట్వీట్ చేశారు. ఆ తర్వాత దక్షిణాది సినిమాలపై స్పందిస్తూ మరో ట్వీట్ వేశారు. ‘‘కేజీఎఫ్ 2 రూ.50 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించడంతో ఉత్తరాది తారలు దక్షిణాది స్టార్స్ పై అసూయతో ఉన్నారన్నది నిజం. ఇకపై బాలీవుడ్ సినిమాల వసూళ్లు ఎలా ఉంటాయో చూద్దాం. బాలీవుడ్ లో బంగారం ఉందా? కన్నడలో బంగారం ఉందా? అనేది ‘రన్ వే 34’ కలెక్షన్ఏల చెప్పేస్తాయి’’ అని వర్మ వరుస ట్వీట్లు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement