Friday, November 22, 2024

Covid-19: కిమ్ కు కొత్త టెన్షన్.. నార్త్ కొరియాలో ఆరు మరణాలు

ఉత్త‌ర‌కొరియాలో క‌రోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా తొలి మరణం సంభవించగా.. తాజాగా మరికొన్ని కేసులు వెలుగు చూశాయి. రాజధాని ప్యాంగాంగ్ లో జ్వ‌రంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. మృతుడిలో ఒమిక్రాన్‌ బీఏ.2ను గుర్తించారు. జ్వరంతో ఆరుగురు మరణించారని, 3.5 లక్షల మంది చికిత్స పొందారని ఉత్తర కొరియా శుక్రవారం తెలిపింది. ఉత్త‌ర‌కొరియాలో ప్ర‌స్తుతం 1,87,800 మంది జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నార‌ని అధికారులు తెలిపారు. వారంద‌రినీ ఐసోలేషన్ లో ఉంచిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి, లాక్‌డౌన్‌ విధించారు. ఏప్రిల్ చివరి నుండి 3.5 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్న వారిలో 1,62,200 మంది కోలుకున్నారని ఉత్తర కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. గురువారం ఒక్కరోజే 18,000 మంది జ్వరం లక్షణాలను గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement