Friday, November 22, 2024

ఉత్తర కొరియాకు పాకిన కరోనా.. తొలి కేసు నమోదుతో లాక్‌డౌన్ విధించిన కిమ్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇప్పుడు ఉత్తర కొరియాకు పాకింది. ఉత్తర కొరియాలో మొదటిసారిగా కరోనా కేసు నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిసున్నప్పటికీ.. ఉత్తర కొరియాలో మాత్రం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదవలేదు. అయితే దేశంలో మొదటి కరోనా కేసు గురువారం వెలుగు చూసింది. దీంతో దేశంలో తీవ్రమైన జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది.  ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లాక్‌డౌన్ విధించారు.

ప్యోంగ్యాంగ్‌లో జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహిచారు. బాధితుల్లో ఒకరికి కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్ సోకిందని తేలింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. వైరస్‌ వ్యాప్తిచెందకుండా అత్యవసర పరిస్థితి విధించారు. కాగా, కరోనా వెలుగుచూసిన రెండేళ్ల తర్వాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement