Friday, November 22, 2024

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది:కిమ్

తమ దేశం ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉందని, కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దిగజారిందని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నాను. అత్యంత గడ్డు పరిస్థితుల్లో నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. వీటిని అధిగమించేందుకు పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు కిమ్. క్షేత్ర స్థాయిలో కొన్ని తప్పులు జరుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందని, ఇకపై అటువంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యలను కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

దాదాపు దశాబ్ద కాలంగా కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియాను పాలిస్తుండగా,కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు పెట్టిన లాక్ డౌన్ తో వ్యవస్థ కుదేలైంది. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తుండటం, అణ్వాయుధాల ప్రయోగాల తరువాత ఆంక్షల తీవ్రత పెరగడంతో ఉత్తర కొరియా తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement