ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు ఉత్తర కొరియాలో విజృంభిస్తోంది. ఇటీవలే ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసులు వెలుగు చేసింది. తాజాగా రోజు వ్యవధిలో కరోనాతో తొలి మరణం సంభవించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. రాజధాని ప్యాంగాంగ్‌లో జర్వంతో మొత్తం ఆరుగురు మరణించారని, వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మృతుడిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న 187,000 మందిని చికిత్స చేస్తున్నారు.
దేశంలో కొంతకాలంగా వైరస్ ఉన్నట్లు వార్తలు వినిపించినా.. అధికారులు గురువారం మాత్రమే మొదటి కేసులను ప్రకటించారు. రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిందని, లాక్‌డౌన్ చర్యలను ప్రకటించామని వారు చెప్పారు. వారు ఖచ్చితమైన కేసు సంఖ్యలను ఇవ్వలేదు.