నార్త్ కరోలినాలో హైవేపై విమానం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడిక్కడే మరణించాడు. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. షార్లెట్ కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో డేవిడ్ సన్ కౌంటీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న I-85 సౌత్ లో డ్యూయల్ ఇంజిన్ బీచ్ క్రాఫ్ట్ బారన్ విమానం..రోడ్డుపై వెళ్లే భారీ ట్రక్కును ఢీకొట్టింది. విమానం ఢీకొట్టడంతో, ట్రక్కు బోల్తా పడి రోడ్డుపైకి దూసుకెళ్లిందని హైవే పెట్రోలింగ్ తెలిపింది. విమానం లారీ ట్రక్కును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.
లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ ను విన్ స్టన్ సేలం హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరణించిన పైలట్ ను షార్లెట్ కు చెందిన రేమండ్ జాన్ అక్లీ (43)గా గుర్తించారు. విమానం క్రాష్‌కు గల కారణాలేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు.అయితే ఎయిర్ పోర్టు రన్ వే నుంచి టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తు్న్నారు. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే FAA దర్యాప్తు ప్రారంభించింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB)తో కలిసి దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలంలోని ఫుటేజీ ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..