నటి జీవితా రాజశేఖర్‌కు నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జోష్టర్ ఎండీ ఫిర్యాదుతో జీవితపై కేసు నమోదు చేశారు. సినీ నటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవితపై జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. త్వరలోనే రాజశేఖర్ జైలుకు వెళతారంటూ ఆ సంస్థ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు పేర్కొన్నారు. తమను జీవితా రాజేశఖర్‌లు భారీఎత్తున మోసగించారని ఆరోపించారు. ఈ కేసులో నగరి కోర్టు జీవితా రాజశేఖర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసిందని వెల్లడించారు.
కాగా, జోష్టర్ ఫిలిం సర్వీసెస్ నుంచి జీవితా రాజశేఖర్‌లు రూ.26 కోట్ల మేర అప్పు తీసుకుని ఎగ్గొట్టారని ఆరోపణలున్నాయి. గరుడ వేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్‌లు అప్పు అడిగితే జోష్టర్ ఫిలిం సర్వీసెస్ తమ ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బు సర్దుబాటు చేసింది. ఆ ఆస్తులను బినామీల పేర్ల మీదకు మార్చుకుని జీవితా రాజశేఖర్‌లు మోసం చేసినట్లు జోష్టర్ ఎండీ ఆరోపించారు. జీవితా రాజశేఖర్‌లపై చెక్ బౌన్స్ కేసు నడుస్తోంది. ఈ కేసులో నగరి కోర్టు వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.