Friday, November 22, 2024

ఆసుపత్రిలో స్ట్రెచర్ల కొరత.. త్రీ ఇడియట్స్ సీన్!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ విస్తరిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్, మందుల కొరతే కాదు ఇప్పుడు స్ట్రెచర్ల కొరత కూడా తీవ్రమైంది. స్ట్రెచర్ లేక  ఓ కోవిడ్ రోగిని ఒక వార్డు నుంచి స్కూటర్ పై తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన ఝార్ఖండ్ లో చోటు చేసుకుంది.

పలమూలోని మెడినిరాయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని బలహీనంగా, నడవలేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు మొదట భుజాలపై మోసుకు వెళ్లి వార్డులోనే స్కూటర్ పై కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్లారు.  అయితే వారు ఆ పేషంటును వేరే  వార్డుకు తరలించారా లేక డాక్టర్లు ఆయనను మరో ఆసుపత్రికి రెఫర్  చేశారా అన్న దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాన్ని నెటిజన్లు త్రీ ఇడియట్స్ సినిమాలో ఓ సన్నివేశంతో పోలుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement