Tuesday, November 26, 2024

Exclusive | హైదరాబాద్​లో షూటింగ్​లు వద్దు.. ఏపీ మంత్రి రోజా భర్త సరికొత్త ఉద్యమం!

సినిమా షూటింగ్​లపై వివాదం తలెత్తింది. హైదరాబాద్​లో షూటింగులతో తమిళ సినీ కార్మికులకు పని లేకుండా పోతోందని కొంతమంది ఉద్యమం ప్రారంభించారు. ఇందులో ఏపీ మంత్రి రోజా భర్త సెల్వామణి ఉండడం విశేషం. హైదరాబాద్​, విశాఖపట్నంలో షూటింగ్​లు చేయడం వల్ల తమిళ కార్మికులు పని కోల్పోతున్నారని కొంతకాలంగా వివాదం తీసుకొచ్చారు.. అందుకని తమిళనాడులోనే షూటింగ్​లు చేయాలని తీర్మానం చేశారు.

– వెబ్​ డెస్క్​, ఆంధ్రప్రభ

హైదరాబాద్​లో తమిళ సినిమా షూటింగ్​లపై వివాదం నెలకొంది. ఇకపై షూటింగులన్నీ తమిళనీడులోనే చేయాలని ఫిల్మ్​ ఎంప్లాయీస్​ ఫెడరేషన్​ ఆఫ్​ సౌతిండియా (ఫిపా)లో  తీర్మానం చేశారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్​ చేస్తే తమ తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని అసోసియేషన్​ తేల్చి చెప్పింది. అంతేకాకుండా షూటింగ్​ల కోసం తమిళ సినీ కార్మికులనే తీసుకోవాలని ఫెప్సీ నిర్ణయించింది.  

కాగా, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారు.ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఉద్యమం లేవదీశారు. తమిళ సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని, అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని సెల్వా అంటున్నారు. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు.

కొంకాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరుగుతున్నాయి. ఇది ఫేప్సీ పేరుతో ఓసినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?.. అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

- Advertisement -

ఏపీలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా ఉన్నారు. నిజానికి దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణికి షూటింగులో లొకేషన్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసు.. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు.. కానీ లేనిపోని వివాదం రేపి తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ చేస్తున్నారని కొంతమంది మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement