ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి అనూహ్య విజయాన్ని సాధించిన అఫ్గానిస్తాన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని అంతా భావించారు. కానీ, న్యూజిలాండ్‌తో చెన్నై వేదికగా ఇవ్వాల (బుధవారం) జరిగిన మ్యాచ్‌లో కివీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 139 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టును దెబ్బతీసింది. కివీస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ అఫ్గాన్ బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చారు.
ఈ మెగా టోర్నీలో కివీస్‌కు ఇది నాలుగో విజయం కాగా , అఫ్గాన్‌కు మూడో ఓటమి. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయిన అఫ్గానిస్తాన్.. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. అఫ్గాన్ బ్యాటర్లలో రహ్మత్ షా ఒక్కడే 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా మిగిలినవారిలో ఒక్కరు కూడా క్రీజులో నిలువలేకపోయారు.