Saturday, November 23, 2024

No Safety: మహిళా రక్షణకు ప్రత్యేక చట్టాలున్నా.. ప్రయోజనం సున్నా!

నేటి సమాజంలో స్త్రీలు అనేక సామాజిక ఆర్ధిక రాజకీయ పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. స్త్రీలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు గృహహింస ఎక్కువవుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్త్రీకి అమ్మ కడుపులో రక్షణ లేదు. పాఠశాల, కళాశాల, కార్యాలయం, అత్తారిల్లు ఎక్కడ భద్రత లేదు. సమాజం నుండి భరోసా లేదు. చట్టం ఉన్నా ప్రయోజనం లేదు. ఇన్ని ప్రతిబంధకాలు మధ్య స్రీ కన్నీరు కార్చని రోజంటూ లేదు. కట్నం కొరకు భర్త, కోరికతీర్చాలని సహోద్యోగి, ప్రేమించాలని యువకుడు, కావాలనే తాకే పక్క సీటు ప్రయాణికుడు… స్థలం ప్రదేశం మాత్రమే మారుతోంది తప్ప హింస స్వరూపం మాత్రం ఒక్కటే.స్రీ రక్షణకు ప్రత్యేక చట్టాలున్నా, అవగాహన లోపం స్త్రీ లకు శాపం గా మారుతోంది.

మహిళా చట్టాలు:-

గృహహింసనిరోధక చట్టం :

ఈ చట్టం ప్రకారం స్త్రీలు తమ రక్షణ కోసం పోలీసు, రక్షణ అధికారులు,స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించవచ్చు. రక్షణ, నివాసం, నష్టపరిహారం వంటి వాటిని పొందవచ్చు.

నిర్భయచట్టం:

- Advertisement -

పిల్లలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు,హింస, కిడ్నాప్ ఈ చట్టం కిందకు వస్తాయి. బాధితులు నేరుగా పోలీస్ లను ఆశ్రయించవచ్చు.

మహిళల అక్రమ రవాణా :

బాలికలతో ప్రేమ నటించడం, ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికడం, కుటుంబ అవసరాలను తీరుస్తామని ఆకర్షించడం, భర్త నుంచి విడిపోయిన మహిళలను లొంగ తీసుకోవడం, ఒంటరి మహిళల నిరక్షరాస్యత, సినిమాల్లో ఛాన్స్, విలాసవంతమైన జీవితాల వైపు ఎర వేయడం, పేదరికం, నిరుద్యోగం తదితర కారణాలు అక్రమ రవాణా కు ప్రధాన కారణాలు.మరోవైపు చిన్నపిల్లల అవయవ అక్రమ రవాణా కోసం కిడ్నాపులు జరుగుతున్నాయి. ప్రతి మహిళకు ఎలాంటి ఆపద వచ్చిన 100,112, మహిళా మిత్ర 1090,1091 కి ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.అలాగే వాటిపై ప్రాంతీయ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

ప్రత్యేక మహిళా కమీషన్:

స్త్రీలపై వేధింపులు, దాడులు, వివక్ష ను కమీషన్ దృష్టికి తీసుకెళ్లి మహిళలు న్యాయం పొందవచ్చు.

స్త్రీ లైగింక వేధింపుల చట్టం:

ప్రభుత్వ పబ్లిక్ ప్రైవేట్ రంగ స్థలాలలో వేతనం తీసుకుని లేదా స్వచ్ఛందంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగినుల అందరికీ ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. మహిళా ఉద్యోగులను పని పేరిట శారీరకంగా తాకడం, లైంగిక అనుగ్రహం కోరడం, లైంగికపరమైన మాటలు మాట్లాడడం, అశ్లీల సాహిత్యం చూపడం,ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం లాంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

మహిళా రక్షణ చట్టాలు -శిక్షలు

మహిళలను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తాయని ఐ పీ సీ 302 సెక్షన్ కింద సదరు వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అసభ్యంగా ప్రవర్తించి మహిళలపై దౌర్జన్యానికి పాల్పడిన సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. మహిళలను అపహరించి బలవంతంగా వివాహం చేసుకుంటే ఐ పీ సి సెక్షన్ 366 ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. వివాహితను వేధిస్తే ఐపీసీ సెక్షన్ 498 ఎ చట్టం ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. భార్య బతికి ఉండగానే మరో వివాహం చేసుకుంటే ఐ పీ సి 494 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. వర కట్నం కోసం భార్యను వేధించి గాయపరిస్తే ఐ పీ సి 304 సెక్షన్ కింద భర్తకు ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా,లైంగిక దాడికి యత్నించినా గరిష్టంగా ఏడేళ్ల వరకు,లైంగిక దాడి చేసి హతమారిస్తే 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు తీవ్రత దృష్ట్యా ఉరి శిక్ష సైతం విధించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement