Friday, November 22, 2024

No Rains – తెలంగాణ‌లో వ‌ర్షాభావం – పొంచి ఉన్న నిశ్శ‌బ్ద క‌ర‌వు ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనివిధంగా తెలంగాణాలో ఈ ఏడాది నిశ్శబ్ద కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. గడిచిన ఐదేళ్ళతో పోలిస్తే.. ఈ ఏడాది వర్షాభావ తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వమిస్తున్న సబ్సిడీలు, రాయితీలతో కొందరు, ప్రత్యామ్నాయ మార్గాలతో మరికొందరు చిన్న, సన్నకారు రైతులు కొంతమేరకు సుస్థిరత సాధించిన నేపథ్యంలో ఆందోళనలు ఉధృతం కావడం లేదు. కానీ, ఇంకొంతకాలం ఇవే పరిస్థితులు కొనసాగితే దుర్భిక్షం తప్పదని వాతావరణ, పర్యావరణ నిపుణుల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అసలే ఎన్నికల ఏడాది.. ఈ రాజకీయ వేడిలో ప్రకృతి వైపరీత్యాలపై పట్టింపు కరువైపోయింది. ఇంకొంత కాలం వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే.. జలాశయాలు ఖాళీ కుండలుగా మారి వ్యవసాయ రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం పొంది ఉంది. కాళేశ్వరం కింద కొన్ని ప్రాజెక్టుల్లో నీళ్ళు నింపి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంటలకు నీళ్ళివ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ, ఎగువ నుంచి ఆశించిన మేరకు వరద రాకపోవడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. గ్రామాల్లో ఇంటింటికీ సురక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థ సుస్థిరమైన నేపథ్యంలో ‘మిషన్‌ భగీరథ’ పథకం అమలుకూ ఇబ్బందులేనన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

గత ఏడాది ఇదే సమయానికి అతివృష్టి కారణంగా మహోగ్రరూపం దాల్చిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నేడు మౌనరాగాన్ని పలకుతోంది. గత ఖరీఫ్‌ సీజన్లో ప్రస్తుత సమయానికి 34 గేట్లు- ఎత్తి పారిన నీళ్ళ చప్పుడు.. ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. 600 టిఎంసిలకు పైగా నీళ్లను గోదవరిలోకి వదిలిన ఎస్సారెస్పీ ఇప్పుడు వర్షాభావం కారణంగా కనీసం సాగుకు కూడా నీరందివ్వని దీనస్థితికి చేరుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. వర్షాలు లేకపోవడంతో ఎగువ నుంచి ఎస్సారెస్పీలోకి వరద రావడంలేదు. ప్రస్తుతం నిల్వ ఉన్నది కేవలం 23 టీ-ఎంసీలు మాత్రమే.నని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుండి రావల్సిన వరద పూర్తిగా తగ్గిపోవడంతో శ్రీరాం సాగర్‌ డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రస్తుతం ఎస్సారేస్పికి సరాసరిగా ఇన్‌ప్లnో 12వేల క్యూసెక్కులు వస్తుండటంతో ఔట్‌ప్లnో కేవలం వెయ్యిలోపు క్యూసెక్కులుగా ఉంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1067 ఉంది. నీటి సామర్థం 90 టీ-ఎంసీలు కాగా ప్రస్తుతం 23 టీ-ఎంసీలు మాత్రమే ఉంది. కాగా, అధికారిక సమాచారం మేరకు గత సంవత్సరం ప్రస్తుత సమయానికి ఎస్సారెస్పీ నీటి మట్టం 1087 అడుగులుగా ఉండి 74 టీ-ఎంసీలతో ప్రాజెక్ట్‌ నిండు కుండను తలపించింది. ఇలాంటి పరిస్థితులు ఈ ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కాలేదు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని అనేక సాగునీటి ప్రాజెక్ట్లుల్లో నీటి లభ్యత కొరవడుతున్న సమస్యలు కనిపిస్తున్నాయి.

ఎగువ రాష్ట్రాల్లోని వర్షభావ పరిస్థితులే ప్రధాన కారణం
నిశ్శబ్ధ కరువుకు దారితీస్తున్న ఈ పరిస్థితులకు ఎగువ రాష్ట్రాల్లోని వర్షభావమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఏడాది పొరుగునున్న మహరాష్ట్రలోనూ వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరే అవకాశాలు లేవు. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు ఆయకట్టు-లో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండలేదు. గత ఏడాది భారీ వరదలతో ఒకేరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. అప్పుడు కోద్ది రోజుల పాటు- లక్ష క్యూసెక్కల ఇన్‌ ప్లో వచ్చింది. ఈ సంవత్సరం మొత్తానికి 74 టిఎంసిల మేర జలాలు చేరాయి. దీంతో 90 టీ-ఎంసీల సామర్థ్యం ఉన్నా.. ఎస్సారేస్పికి గరిష్టంగా 76 టీ-ఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది గడిచిన ఫిబ్రవరి నెలలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ నుండి సాగు నీటిని విడుదల చేయడంతోనే నిల్వ తగ్గిపోయింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వద్ద మొత్తం 42 గేట్లకు గానూ, గత ఏడాది 34 గేట్లు- ఎత్తడంతో ఆయకట్టు రైతులు ఆంనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మాత్రం ఒక్క గేటు- కూగా ఎత్తే అవకాశం లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. కేవలం 23 టిఎంసిల డేడ్‌ స్టోరేజి సమీపంలోకి రావడం ఆశ్యర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది.

దిగువ మానేరు ఆయకట్టు ఆశలన్నీ కాళేవ్వరం పైనే..
దిగువ మానేరు డ్యాం ఎగువన సుమారు ఆరున్న లక్షల ఎకరాల సాగుకు 50 టీ-ఎంసీలు సాగు నీరు అవసరం. అయితే వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు ఆలస్యమవుతోంది. ఈ సీజన్‌లో రైతులకు కాల్వలు, ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేందుకు.. గడువు కూడా ఎంతో దూరంలో లేకపోవడంతో ఇప్పుడు కాళేశ్వరం నుండి ఎత్తిపోస్తున్న నీటిపైనే రైతులు ఆశలు పెట్టు-కున్నారు.. దీనివల్ల సాగునీటి ఇక్కట్లు- తప్పుతాయని బావించిన ప్రభుత్వం.. మోటార్ల ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లను నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ వద్ద నిర్మించిన పంప్‌హౌజ్‌ ద్వారా నేరుగా ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీనితో రోజుకు ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే వచ్చి చేరుతున్నాయి. దీని కోసం ముప్కాల్‌ పంపుహౌజ్‌లో 6.5 మెగావాట్ల సామర్ధం ఉన్న ఎనిమిది చొప్పున మోటార్లు బిగించారు. వీటిని ఒక రోజు నడిపితే ఒక టీ-ఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలించేందుకు వీలెంది. ఇది రైతులకు వరప్రదాయని అని రైతులు అంటు-న్నారు. ఇకనుంచైనా భారీ వర్షాలు కురిసి ఆశించిన వర్షపాతం నమోదు కాకపోతే సాగు నీరు ఇవ్వడం కష్టమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కష్టాల్లో కల్వకుర్తి ఆయకట్టు- రైతులు

- Advertisement -

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద ప్రస్తుత వానాకాలం సరాసరిగా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగు నీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం వర్షబుూభావం కారణంగా నెరవేరే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. రెండున్నరేళ్ళ కిందట ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మూడో పంప్‌ పూర్తిగా దెబ్బతినగా, ఐదో పంప్‌ ఉపయోగంలో లేకుండా పోయింది. వీటిని రిపేర్‌ చేయడానికి ప్రభుత్వం రూ.15 కోట్లు- కేటాయించింది. అయితే పనుల పర్యవేక్షణలో లోపం ఉన్న కారణంగా సకాలంలో ఫలితాన్నివ్వలేకపోతోంది. ఈ ప్రాజెక్ట్‌లో కీలకమైన నార్లాపూర్‌ రిజర్వాయర్‌, మెయిన్‌ కెనాల్‌, పంప్‌హౌస్‌, సర్జ్‌పూల్‌ ఎలక్ట్రో మెకానికల్‌ వర్క్స్‌ ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు లేవు. దీంతో కల్వకుర్తి మెయిన్‌ కెనాల్‌ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు లింక్‌ ఇచ్చారు. ఎల్లూరు నుంచి నీటిని తరలించి అక్కడ ఒక్క పంప్‌ స్టార్ట్‌ చేయగలిగితే చాలని ఇంజనీర్లు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కేఎల్‌ఐ చివరి ఆయకట్టు-కు నీళ్లు ఎలా ఇస్తారనే విషయంపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నానాటికీ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement