Saturday, November 23, 2024

క‌డ‌లిలో క‌లుస్తున్న వ‌ర‌ద‌ నీటికి మోక్షం లేదా?…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: జలవివాదాలు ఆకాశాన్ని అంటుతున్నా భూమిపై ఉన్న సముద్రాల్లోకి వరద నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేసే ఆలోచనలను పాలకవర్గాలు చేయకపోవడంతో విలువైన జల సంపద సముద్రం పాలవుతుంది. ఎడారుల్లో జలాశయాలు నిర్మిస్తూ భూగర్భ జలాలు పెంచే పరిజ్ఞానం ఉన్న దేశంలో కళ్లముందు కడలిలో కలుస్తున్న జలాలను కాపాడుకునే ప్రయత్నం కేంద్రం చేయకపోవడంతో ఏటా 50 వేల టీఎం సీలు సముద్రంలో కలుస్తున్నాయి.
విభజించి పాలించు అనేసూత్రంతో రూపొందించిన నీటి చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉండటంతో బ్రిటిష్‌ వలసపాలకుల ఆలోచనలు నేటికి నెరవేరుతున్నాయి. అంతరాష్ట్ర వివాదాలతో కొత్తప్రాజెక్టుల నిర్మాణాలు ముందుకు సాగడంలేదు. పరిష్కరించాల్సిన కేంద్ర జలశక్తి సమస్యలకు పీటముడులు వేస్తుందేకానీ పరిష్కార దిశలో ఆలోచించకుండా నదుల అనుసంధానాన్ని తెరమీదకు తెచ్చి వివాదాలకు ఆజ్యం పోస్తుంది. రాష్ట్రాలకు ఉన్న నీటి వాటాలను కాపాడుతూ సముద్రంలో కలిసే వరదజలాల పంపిణీ చేపడితే సమస్యకు పరిష్కారం సులభతరమవుతునందని జలనిపుణుల సలహాలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకోక పోవడంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాలమధ్య ఉన్న జలవివాధాలు పరిష్కారం కావడంలేదు.

దేశవ్యాప్తంగా జలవివాదాలు జఠిలమవుతున్నాయి. సట్లేజ్‌, రావి, బియాస్‌ నదుల నీటిపంపకాలు పంజాబు, రాజస్తాన్‌, హర్యానాలో వివాదాలకు తెరతీయగా కావేరి వివాదం కర్ణాటక, తమిిళనాడు మధ్యలో రావణ కాష్టంలా రగిలిపోతూనే ఉంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ వివాదలు అలాగే ఉన్నాయి. కృష్ణా నదీ నీటి పంపిణీలో ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదాల జ్వాలలు రగులు తూనే ఉన్నాయి. ఇలా అనేక రాష్ట్రాల్లో నీటి పంపకాల అంశంలో వివాదాలు పరి ష్కృతంగానే మిగిలాయి. ఆంశాలను పరిశీలించి కొత్తగా ప్రాజెక్టులకు రూపకల్పనచేస్తే సముద్రంలో కలిసే వరద జలాల్లో కొంతభాగమైన మిగిలిపోతుందనే ఆలోచన చేయకపోవడంతో వరదజలాలు కడలి పాలవుతూనే ఉన్నాయి. అయితే సమస్యలను పరిష్కరించాల్సిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ 20 ఏళ్లనుంచి సమస్యలను నానబెడుతుందే కాని పరిష్కరించకపోవడంతో వివాదాలు న్యాయ స్థానాల మెట్లు ఎక్కుతున్నాయి. ప్రతిఏటాసముద్రంలో కలిసే వరదజలాల్లో ఆవిరి కాగా మిగిలిన 75 వేల టీఎంంససీలు వినియోగించుకునే అవకాశాలున్న ప్పటికీ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో దేశవ్యాప్తంగా కేవలం 20 నుంచి 21 వేల టీఎంసీ నీటిని వ్యవసాయ, తాగునీటికి వినియోగిస్తున్నారు. మిగతా 50 వేల టీఎంసీ నీరు సముద్రం పాలవుతుంది. అయితే ప్రపంచంలోని అనేక దేశాలు వర్షం నీరు సముద్రం పాలు కాకుండా భారీ ప్రాజెక్టులు నిర్మించడంతో ఆదేశాల్లో సాగునీటి కొరతలేదు.పంటలకు నీరందించే ప్రణాలికను అక్కడి ప్రభుత్వాలే అమలు చేస్తున్నాయి.

ప్రంచదేశాల్లో సముద్రం నీటికి అడ్డుకట్టలు వేస్తూ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మనదేశంలో ఈ మేరకు ప్రయత్నాలు కూడా జరగకపోవడంతో భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు జరగడంలేదు. ఫలితంగా 50 వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశవ్యాపంతగా జలవిధానం తీసుకురావాలని పదేపదే చెప్పుతున్నారు. అంతరాష్ట్ర వివాదాలను పరిష్కరించుకుని కాళేశ్వరం నిర్మించిన చరిత్ర దేశానికి ఆదర్శంగా చూపిస్తున్నారు. ప్రాజెక్టులను నిర్మించి దేశాన్ని సస్యశ్యామలం చేసే దిశలో కేంద్రంలోని పాలకవర్గాలు ఎందుకు ప్రయత్నించడంలేదని కేసీఆర్‌ బహిరంగంగా విసిరిన సవాళ్లకు కేంద్రం దగ్గర సమాధానం లేదు. కేంద్రం సహకరించి కృష్ణా గోదావరిలో తెలంగాణ వాటాతేల్చితే కృష్ణ నుంచి సముద్రంలో కలిసే 789.297 టీఎంససీ నీటిని, గోదావరి నుంచి సముద్రంలో కలిసే 3.073,259 టీఎంససీల నీటిలో తెలంగాణ వాటా తేలిస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించేందుకు తెలంగాణ దగ్గర ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు. ఎడారిలో వర్షంనీటితో జలాశయాలు నిర్మించిన అవ్లూ రుయాన్‌ ఉన్న ఈ దేశంలో సముద్రంలో కలిసే జలాలను సద్వినియోగం చేసుకోవడం సుసాధ్యంకాదని జలనిపుణులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement