Friday, November 22, 2024

ఇక‌పై ఒంట‌రిగా ట్రెక్కింగ్ కి నో ప‌ర్మిష‌న్.. ప్ర‌క‌టించిన నేపాల్

ఇక‌పై ఒంట‌రిగా ట్రెక్కింగ్ కి వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ లేద‌ని నేపాల్ ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఏప్రిల్ 1 నుంచి విదేశీయులు నేపాల్ లో ఒంటరిగా ట్రెక్కింగ్ కు వెళ్లేందుకు అనుమతించరు. వెంట గైడ్ ను తీసుకెళ్లడం తప్పనిసరి. అతిథుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేపాల్ ప్రకటించింది.ట్రెక్కింగ్ లో ఎంత అనుభవం ఉన్న వారైనా సరే స్థానిక గైడ్ సేవలతోనే వెళ్లాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పర్యాటకులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయి. నేపాల్ నేషనల్ పార్క్ ల పరిధిలోని పర్వతాలకే ఈ నిబంధనలు అమలవుతాయి.

ఇవి కాకుండా ఖాట్మండు చుట్టు పక్కల ఉన్న పర్వతాలను విదేశీయులు ఒంటరిగానే ఎక్కేవయవచ్చు.
నేపాల్ 2017లో మౌంట్ ఎవరెస్ట్ తదితర ముఖ్యమైన పర్వాతాలను ఒంటరిగా ఎక్కకుండా నిషేధించగా, ఇప్పుడు ఆ జాబితాను విస్తరించింది. ప్రపంచంలోనే 10 ఎత్తయిన పర్వతాల్లో 8 నేపాల్ లో ఉన్నాయి. వీటిల్లో కొన్ని నేపాల్ తో పాటు చైనాలోనూ విస్తరించి ఉన్నాయి. ఏటా పర్వతారోహణకు సంబంధించి నేపాల్ లో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. హిమపాతాలు, మంచు తుపానులు, ఎత్తయిన ప్రదేశానికి చేరిన తర్వాత భయంతో అనారోగ్యానికి గురికావడం ప్రమాదాలకు కారణాలుగా మార‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement