రష్యాకు చెందిన స్పుత్నిక వి వ్యాక్సిన్ సంరక్షణ బాధ్యత తమ సంస్థకే ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ స్పష్టం చేసింది. పంపిణీ హక్కులు ఏ కంపెనీకి అప్పగించలేదని శుక్రవారం వెల్లడించింది. తొలి 25 కోట్ల డోసుల పంపిణీ బాధ్యత తమదేనని తెలిపింది. కంపెనీ తరఫున వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి థర్డ్ పార్టీని నియమించలేదని పేర్కొంది. అనధికారిక వ్యక్తులు స్పుత్నిక్-వి టీకాను సరఫరా చేస్తామని వస్తే నమ్మొద్దని సూచించింది. ఈ మేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో (ఆర్‌డీఐఎఫ్) కలిసి డాక్టర్ రెడ్డీస్ సంయుక్త ప్రకటన వెలువరించింది. కంపెనీ ప్రతినిధులమంటూ ఎవరైనా సంప్రదిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. స్పుత్నిక్–వి పేరుతో మోసాలకు పాల్పడే వ్యక్తులపట్ల చట్టపరమైన చర్యలు తీసు కుంటున్నాం. అనధికార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, నకిలీ ఉత్పత్తులకు కంపెనీ బాధ్యత వహించదు’ అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది.
జూన్ రెండోవారంకల్లా వాణిజ్యపరంగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నాలుగు నెలలుగా రెండు కంపెనీల టీకాలతో దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను 2021, జనవరి 16 నుంచే ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది భారత ప్రభుత్వం. ఆక్స్ ఫర్డ్ వర్సిటీతో కలిసి సీరమ్ ఇనిస్టిట్యూట్ మనదేశంలో తయారుచేస్తున్న ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ తోపాటు హైదరాబాదీ కేంద్రంగా భారత్ బయోటెక్ తయారు చేసిన కరోనా టీకా ‘కొవాగ్జిన్’ను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆనందయ్య మందు పంపిణీపై క్లారిటీ