హీరో రామ్ చరణ్ తన తల్లి సురేఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ బర్త్ డే నేడు. కాగా ఆచార్య సెట్స్ లో కొణిదెల సురేఖ ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు రామ్ చరణ్. ఆ ఫొటోలో సురేఖకు చెరోవైపున చిరంజీవి, రామ్ చరణ్ ఉన్నారు. ట్విట్టర్ లో ఈ పిక్ పంచుకున్న రామ్ చరణ్… “నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను మరెవ్వరూ అర్థం చేసుకోలేరు… హ్యాపీ బర్త్ డే మా” అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు. ఇప్పుడీ ఫొటో వైరల్ గా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..