Friday, November 22, 2024

భయపడకండి… ఏపీ వైరస్ ప్రమాదకరం కాదు

ఏపీలో వెలుగు చూసిన కరోనా కొత్త రకంపై కేంద్ర బయోటెక్నాలజీ శాఖ స్పష్టత ఇచ్చింది. ఏపీలో వెలుగు చూసిన రకం అంత బలమైనదేమీ కాదని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణు స్వరూప్ తెలిపారు. వైరస్ జన్యు పరిణామ క్రమాన్ని విశ్లేషించినప్పుడు N440K రకం బయటపడిందని, అయితే అంతే వేగంగా అది మాయమైందని అన్నారు. దాని విస్తరణ కనిపించలేదని స్పష్టం చేశారు. దాని క్లినికల్ ప్రభావం కూడా ఏమీ కనిపించలేదన్నారు. ప్రస్తుతం దేశంలో కొత్తగా గుర్తించిన B617 మినహా కొత్త వైరస్ రకాలేమీ లేవని పేర్కొన్నారు. ఇది వ్యాప్తి పరంగా, తీవ్రత పరంగా ప్రభావం చూపుతోందన్నారు. B618 రకాన్ని కనుగొన్నప్పటికీ అది త్వరగానే అంతర్థానమైందని రేణు స్వరూప్ తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement