పార్టీ ఏదైనా ఆయన సలహా ఇచ్చారంటే ఆ పార్టీ విజయపథంలోకి దూసుకుపోవడం ఖాయమనే సెంటిమెంట్ నడుస్తోంది. అందుకే పలు పార్టీల అధినేతలు ఆయనతో భేటీ అయ్యేందుకు సుముఖత చూపిస్తుంటారు. ఆయనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. కాగా ఏపీలో పీకే సేవలకి నో చెప్పింది అధికార పార్టీ..ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ప్రశాంత్ కిశోర్ సేవలకు బదులుగా థర్డ్ పార్టీ సేవలను వినియోగించుకుంటున్నామని ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు.2014 ఎన్నికల్లో స్వల్ప మార్జిన్‌తో చాలా సీట్లలో ఓడిన వైసీపీ… అధికారం చేజిక్కించుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్ ను పార్టీ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న వైసీపీ… ప్రచారంలో వైరి వర్గాలను దాటేసి సత్తా చాటింది. పీకే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసిన వైసీపీ 2019 ఎన్నికల్లో రికార్డు విక్టరీ కొట్టింది. తాజాగా మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పీకే సేవలను వినియోగించుకోవడం లేదంటూ ఆ పార్టీ నుంచి ప్రకటన చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఏ ధీమాతో వారు పీకే సేవలని వినియోగించుకోవడం లేదో వారికే తెలియాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement