Thursday, November 21, 2024

ఎన్ని వైరస్ లు వచ్చినా.. ఎదుర్కొనేలా వైద్య రంగం.. కేసీఆర్

భవిష్యత్ లో ఎన్నో వైరస్ లు వచ్చి పట్టి పీడిస్తాయని.. ఎన్ని వైరస్ లు వచ్చినా.. వాటిని ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని 8 కొత్త మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందన్నారు. వైద్య రంగంలోనూ అదే పద్దతి కొనసాగాలన్నారు. వైద్య రంగంలో ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తామన్నారు. గతంలో 850 సీట్లు ఉండేవని, ఇప్పుడు 2790 సీట్లకు పెరిగాయన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తామన్నారు. నర్సింగ్ కాలేజీలను కూడా నిర్మిస్తామన్నారు. వైద్య సహాయక సిబ్బందిని నియమిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement