కరోనా వల్ల అందరికి మాస్క్ ల ప్రాధాన్యత తెలిసింది. కాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో మాస్క్ ల విలువ తగ్గింది. మాస్క్ లని ధరించే వారి సంఖ్య తగ్గింది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అన్ని దేశాలకి వ్యాపిస్తోంది. దాంతో మాస్క్ తప్పనిసరి అని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి. ఈ మేరకు మాస్క్ పెట్టుకోని వారికి జరిమానా కూడా విధిస్తున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్రంలో మాస్క్ పెట్టుకోని వారికి వెయ్యి రూపాయల ఫైన్ విధించింది. ఈ మేరకు మాస్క్ పెట్టుకోనివారిపై కేసులు నమోదు చేసింది. కాగా పోయిన సంవత్సరం నుండి మాస్క్ లు ధరించని వారిపై 3,26,758మందిపై కేసులు నమోదు అయ్యాయి. అంతేకాదు వారికి వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించడం విశేషం.
రాష్ట్రంలో మాస్క్ పెట్టుకోకుండా ఉల్లంఘించిన వారిపై వేసిన జరిమానాలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ఇప్పటివరకూ రూ.131 కోట్ల ఆదాయం వచ్చింది. హెల్మెట్ లేకపోతే.. ఫొటోలు తీసి ఫైన్లు వేస్తున్న పోలీసులు ఇప్పుడు మాస్క్ లేకుండా వాహనాలు నడిపే వారికి చలాన్లు వేస్తున్నారు. ఫొటో సహా మొబైల్స్ కు మెసేజ్ లు పెడుతున్నారు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రూ.5 రూపాయల మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 రూపాయల ఫైన్ వేస్తున్న పోలీసుల తీరు చూసి నిర్లక్ష్యంగా వ్యవహరించే జనాలు మొత్తుకుంటున్నారు. పబ్లిక్ ప్లేసులలో ఉచితంగా మాస్క్ లను పోలీసులు, ప్రభుత్వం అందుబాటులో ఉంచొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.ఏది ఏమైనా సరే ఇదంతా ప్రజల మేలుకోసమే అనేవారు లేకపోలేదు. వారి రక్షణకోసమే రక్షకభటులు కఠిన చర్యలు అంటున్నారు పలువురు. నిజమేగా మరి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..