Thursday, October 31, 2024

No Marriages – చైనాకు కొత్త త‌ల‌నొప్పి – పెళ్లిళ్ళ‌కు యూత్ దూరం….

చైనాకు కొత్త తలనొప్పి వచ్చి పడింది. జనాభా పెరుగుదలలో తగ్గుదల, నానాటికీ జననాల సంఖ్య తగ్గి పోవడం వంటి వాటితో సతమతమవుతున్న చైనా ఒక్కసారి ఉలిక్కిపడింది. 1986 తర్వాత ఎన్నడూ లేనివిధంగా పెళ్లిళ్ల సంఖ్య గణనీ యంగా తగ్గిపోయిందని తెలియడంతో కలవరపాటుకు గురైంది. 2021తో పోలిస్తే 10.5 శాతం మేర వివాహాల సంఖ్య తగ్గిపో యిందని ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ వెల్లడించింది. 2022లో 60.8 లక్షల వివా హాలు జరిగాయని, 2021లో 76.3 లక్షల వివాహాలు జరిగాయని పేర్కొంది. కరోనా మహమ్మారి వ్యాపించిన నేపథ్యంలో ప్రజ లు ఇంటికే పరిమితమైపోవడం, జీవితాలు దుర్భరంగా మారడంతో ఈ పరిస్థితి ఏర్ప డిందని భావించిన ప్రభుత్వం అప్రమత్తమై ంది.

అనేక ఆంక్షలు, నిబంధనలను సడలి స్తూ వివాహాలను, ఇద్దరు పిల్నల్ని కనమం టూ ప్రోత్సహిస్తోంది. అలాగే జననాల రేటు కూడా గణనీయంగా తగ్గిపోయింది. 2022లో ప్రతి వెయ్యిమందికి 6.77 చొప్పున జనన రేటు ఉంటే, 2021లో 7.52 చొప్పున నమోదైంది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 2022లో జననాల రేటు తగ్గిందన్నమాట. అలాగే అదే సమయంలో మరణాల రేటు గణనీయంగా పెరగడం గమనార్హం. 1974 తరువాత అత్యధిక మరణాల రేటు 2022లో నమోదైంది. ప్రతి వెయ్యిమందిలో 7.37 మంది ప్రాణాలు కోల్పో యారు. 2022లో చైనా జనాభా గణనీ యంగా తగ్గిన విషయం తెలిసిందే. 60 ఏళ్ల తర్వా త ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవనవ్యయం పెరగ డం, కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాలు, కు టుంబ వ్యవస్థపై విముఖత వంటి పరిణామాల నేప థ్యంలో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయి. ఈ పరి స్థితుల్లో వివాహాలను ప్రోత్సహించాలని చైనా ప్రభు త్వం నిర్ణయించింది.

ప్రధానంగా 20 మహానగరాలలో న్యూ ఎరా పేరుతో కల్యాణాలు జరిపించాలని నిర్ణయించింది. ఒంటరి, అవివాహితలు ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు గత మార్చిలో కొన్ని ప్రతిపాదనలు చేయడం విశేషం. జనాభా పెంచుకోవడానికి చైనా కష్టాలు పడుతోంది. వివాహం చేసుకునే అబ్బాయిలకు పెయిడ్‌ లీవ్‌ మంజూరు చేయడానికి సిద్ధమైందంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement